Kajal Aggarwal : కాజ‌ల్ అగ‌ర్వాల్ కొడుకు పేరు వెనుక ఉన్న సీక్రెట్ అదే.. నీల్‌కు చూపించే మొద‌టి సినిమా ఏంటంటే..?

ల‌క్ష్మీ క‌ళ్యాణం చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal). చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Kajal Aggarwal : కాజ‌ల్ అగ‌ర్వాల్ కొడుకు పేరు వెనుక ఉన్న సీక్రెట్ అదే.. నీల్‌కు చూపించే మొద‌టి సినిమా ఏంటంటే..?

Kajal Aggarwal son Neil Kitchlu

Updated On : July 5, 2023 / 4:31 PM IST

Kajal Aggarwal son Neil Kitchlu : ల‌క్ష్మీ క‌ళ్యాణం చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal). చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మ‌గ‌ధీరతో స్టార్‌ హీరోయిన్ అయిపోయింది. దాదాపు అంద‌రూ అగ్ర‌ హీరోల‌తోనూ న‌టించింది. తెలుగుతో పాటు త‌మిళంలో వ‌రుస‌గా చిత్రాల‌ను చేస్తూ కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్న టైమ్‌లో త‌న స్నేహితుడు, వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూ(Gautam Kitchlu)ను 2020 అక్టోబ‌ర్ 30న వివాహం చేసుకుంది.

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా అత్యంత స‌న్నిహితులు, కుటుంబ స‌భ్యుల మ‌ధ్య ఈ వేడుక జ‌రిగింది. 2022 ఏప్రిల్‌లో వీరికి పండంటి బాబు జ‌న్మించాడు. ఆ బిడ్డ‌కు నీల్ కిచ్లూ (Neil Kitchlu అని పేరు పెట్టిన సంగ‌తి తెలిసిందే. కాగా.. బాబుకు ఆ పేరును పెట్ట‌డానికి గ‌ల కార‌ణాన్ని ఇటీవ‌ల కాజ‌ల్ చెప్పింది. తాను ఎక్కువ‌గా శివుడిని పూజిస్తాన‌ని, త‌న‌కు బిడ్డ పుడితే శివుడి పేరు క‌లిసి వ‌చ్చేలా పెట్టాల‌ని బావించాన‌ని తెలిపింది.

Bro Movie : పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీ అప్డేట్.. ఆస్ట్రియాలో షూటింగ్!

త‌న‌యుడు పుట్టిన త‌రువాత పిల‌వ‌డానికి, రాయ‌డానికి అనువుగా ఉండేలా పేరు పెట్టాల‌ని భ‌ర్త గౌత‌మ్ కోర‌డంతో.. నీల‌కంఠుడైన శివుడి పేరులోని మొద‌టి రెండు అక్ష‌రాల‌ను తీసుకుని నీల్ అని పేరును పెట్టినట్లు చెప్పింది. త‌న కొడుకు నీల్‌కు 8 సంవ‌త్స‌రాలు వ‌చ్చే వ‌ర‌కు సినిమాలు చూపించ‌నంది. త‌న కుమారుడికి చూపించే మొద‌టి సినిమా తాను న‌టించిన ‘తుపాకి’ సినిమానని చెప్పింది. త‌మిళ న‌టుడు విజ‌య్ హీరోగా ఏఆర్ ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. తెలుగు, త‌మిళ బాష‌ల్లో 2012 యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీసు వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది.

ఇక ప్రెగెన్సీ కార‌ణంగా గ‌త కొంత‌కాలం సినిమాల‌కు దూరంగా ఉన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవ‌ల త‌న కెరీర్‌పై ఫోక‌స్ పెట్టింది. ప్ర‌స్తుతం వ‌రుస చిత్రాల‌తో బిజీగా ఉంది. క‌మ‌ల్‌హాస‌న్ స‌ర‌స‌న ‘ఇండియ‌న్‌-2’, బాల‌కృష్ణ‌తో ‘భ‌గ‌వంత్ కేసరి’, ‘స‌త్య‌భామ’ చిత్రాల్లో ఆమె న‌టిస్తోంది.

Niharika : అఫీషియల్‌.. విడాకులు తీసుకున్న నిహారిక- చైతన్య