Bro Movie : పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీ అప్డేట్.. ఆస్ట్రియాలో షూటింగ్!
పవన్ కళ్యాణ్ బ్రో మూవీ కొత్త అప్డేట్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్. ఆస్ట్రియాలో ఈ మూవీ సాంగ్ షూటింగ్..

Pawan Kalyan Bro Movie shooting complete by Sai Dharam Tej song
Bro Movie : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. సోషియో ఫాంటసీ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ మరోసారి దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ మోడరన్ శ్రీకృష్ణుడిగా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు బ్రో సినిమాలో టైం అనే దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు.సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తమిళ్ హిట్ మూవీ వినోదయ సితం (Vinodaya Sitham) కి రీమేక్‌గా తెరకెక్కుతుంది.
Bro Theatrical Business :‘బ్రో’ థియేట్రికల్ బిజినెస్.. అక్షరాల వంద కోట్లు..!
ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ లో భారీ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. దీంతో ఈ మూవీ రిలీజ్ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. జులై 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే చిత్ర యూనిట్ మూవీలోని ఒక సాంగ్ చిత్రీకరణ కోసం ఆస్ట్రియా వెళ్లారు. అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో సాయి ధరమ్ తేజ్ అండ్ కేతిక శర్మ (Ketika Sharma) పై ఒక డ్యూయెట్ ని చిత్రీకరించారు. ఈ సాంగ్ షూట్ తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తి అయ్యినట్లు తేజ్ తెలియజేశాడు.
Devil : డెవిల్ గ్లింప్స్ రిలీజ్.. నందమూరి అభిమానులకు కళ్యాణ్ రామ్ బర్త్‌డే గిఫ్ట్..
అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. తనకి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతులు తెలియజేశాడు. కాగా ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీలోని ఫస్ట్ సింగల్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు థమన్ తెలియజేశాడు. ఇక ఇటీవల ఈ మూవీలోని ఒక సాంగ్ లో పవన్ స్టిల్ ని దర్శకుడు సముద్రఖని షేర్ చేశాడు. ఆ స్టిల్ జల్సా మూవీ పోస్టర్ ని తలపించడంతో అభిమానులు.. ‘సంజయ్ సాహు ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram