Bro Theatrical Business :‘బ్రో’ థియేట్రికల్ బిజినెస్.. అక్ష‌రాల వంద కోట్లు..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan kalyan) త‌న మేన‌ల్లుడు సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌(Saidharam Tej) తో క‌లిసి న‌టిస్తున్న చిత్రం బ్రో.

Bro Theatrical Business :‘బ్రో’ థియేట్రికల్ బిజినెస్.. అక్ష‌రాల వంద కోట్లు..!

Bro

Updated On : July 5, 2023 / 3:40 PM IST

Bro : ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan kalyan) త‌న మేన‌ల్లుడు సుప్రీం హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్‌(Saidharam Tej) తో క‌లిసి న‌టిస్తున్న చిత్రం బ్రో(Bro). త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన వినోద‌య సితం (Vinodaya Sitham) చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కుతోంది. ఒరిజిన‌ల్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన స‌ముద్ర‌ఖ‌ని (Samuthirakani)నే ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. థ‌మ‌న్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇటివలే పాటలతో సహా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జ‌రుగుతున్నాయి. జూలై 28న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈక్ర‌మంలో ఇప్ప‌టికే చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్యక్ర‌మాల‌ను మొద‌లుపెట్టింది. అప్‌డేట్స్‌తో చిత్ర బృందం సినిమాపై అంచ‌నాల‌ను పెంచేసింది. ఇదిలా ఉంటే ఇటీవ‌లే థియేట్రిక‌ల్ బిజినెస్ పూర్తి చేస్తుకున్న‌ట్లు తెలుస్తోంది.

Samantha : సమంతకు టెడ్డీబేర్ గిఫ్ట్.. ఎవరు ఇచ్చారో తెలుసా..?

ఆంధ్రా హ‌క్కులు రూ.40 కోట్లు, నైజాం హ‌క్కులు రూ.30 కోట్లు, సీడెడ్ హ‌క్కులు రూ. 13 కోట్ల‌కు అమ్ముడ‌వ్వ‌గా ఓవర్సీస్ హ‌క్కులు రూ. 13 కోట్లకు డీల్ ఫైన‌లైజ్ అయిన‌ట్లు తెలుస్తోంది. కర్ణాటకతో పాటు రెస్టాఫ్ ఇండియా థియేట్రికల్ రైట్స్ భారీ ధ‌ర‌కు అమ్ముడుపోయాయ‌ట‌. ఏదీ ఏమైన‌ప్ప‌టికీ విడుద‌ల‌కు ముందే వంద కోట్ల బిజినెస్ పూర్తి చేసుకున్న బ్రో విడుద‌ల అయిన త‌రువాత ఇంకెన్ని సంచ‌నాలు సృష్టిస్తుందో చూడాల్సిందే.

ఇదిలా ఉంటే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అటు రాజ‌కీయాలు, ఇటు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌, OG చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. వీటిలో ముందుగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న OG విడుద‌ల అయ్యే అవ‌కాశం ఉంది. ఎందుకంటే శ‌ర‌వేగంగా ఈ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

Dil Raju : దిల్ రాజు రెండో భార్య కొడుకు మొదటి పుట్టినరోజు వేడుకలు చూశారా..