Krithi Shetty : తమిళ స్టార్ డైరెక్టర్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన కృతి శెట్టి

ఉప్పెన సినిమా తర్వాత హీరోయిన్ కృతి శెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ అనుకున్నంత పేరు రాలేదు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ సినిమాలో కృతి శెట్టి ఛాన్స్ కొట్టేశారు.

Krithi Shetty

Krithi Shetty : ఉప్పెన సినిమా తర్వాత హీరోయిన్ కృతి శెట్టి ఖాతాలో సరైన హిట్ పడలేదని చెప్పాలి. తెలుగు, తమిళ,మళయాళ భాషల్లో వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న కృతి తాజాగా లక్కీ ఛాన్స్ కొట్టేసారు. లవ్ టుడే హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాధన్‌కి జోడిగా కొత్త సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాని తమిళ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నారు.

Unstoppable with NBK : అన్‌స్టాపబుల్ నెక్ట్స్ ఎపిసోడ్ ప్రోమో చూసారా?

2021 లో వచ్చిన ‘ఉప్పెన; సినిమా ఓ ఊపు ఊపేసింది. ఆ సినిమాలో నటనకి మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్ కృతి శెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. శ్యామ్ సింఘ రాయ్, బంగార్రాజు, వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ సినిమాలతో పాటు తమిళ, మళయాళ సినిమాల్లో కృతి శెట్టి బిజీ అయిపోయారు. కానీ ఉప్పెన సినిమాకు వచ్చినంత పేరును ఈ సినిమాలు తీసుకురాలేకపోయాయి. ప్రస్తుతం కృతి తెలుగులో శర్వానంద్‌తో ఒకటి, తమిళంలో రెండు, మళయాళంలో రెండు ప్రాజెక్టులు కృతి చేతిలో ఉన్నాయి.

Varun Tej : హనీమూన్ కంప్లీట్.. ప్రొఫెషనల్ లైఫ్‌లోకి వచ్చేసిన మెగా హీరో

కాగా కృతి శెట్టి తాజాగా లవ్ టుడే సినిమా హీరో, డైరెక్టర్ ప్రదీప్ రంగనాధన్‌తో తమిళంలో కొత్త సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాని నయనతార భర్త తమిళ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో SJ సూర్య, యోగి బాబు కూడా నటిస్తున్నారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో మరియు రౌడీ పిక్చర్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) అనే ఫన్నీ టైటిల్ పెట్టారు. లవ్, కామెడీ నేపథ్యంలో నిర్మాణం అవుతున్న ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం జరిగింది. ‘LIC లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ను పూజా కార్యక్రమంతో ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది’ అంటూ దర్శకుడు విగ్నేష్ శివన్ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.