Krithi Shetty : లిప్‌లాక్, బోల్డ్ సీన్స్ అన్నీ మామూలు సీన్స్ లాంటివే : కృతిశెట్టి

ఈ సినిమాలో కృతి పూర్తిగా మోడ్రన్ క్యారెక్టర్ చేసింది. ఇందులో కృతిశెట్టి సిగరెట్ తాగే సన్నివేశాలు, నానికి లిప్ లాక్ ఇచ్చే సన్నివేశాలు, నానితో వీర లెవెల్లో రొమాన్స్ సీన్స్..........

Krithi Shetty : లిప్‌లాక్, బోల్డ్ సీన్స్ అన్నీ మామూలు సీన్స్ లాంటివే : కృతిశెట్టి

Krithishetty

Updated On : December 26, 2021 / 3:25 PM IST

Krithi Shetty :   ఉప్పెన’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపొయింది కృతిశెట్టి. ఈ ఒక్క సినిమాతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ‘ఉప్పెన’ సినిమాలో బాగా నటించడమే కాకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టింది. ఇక ‘ఉప్పెన’ తర్వాత కృతి ఇటీవల వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో ఉప్పెనని మించి రొమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నానికి లిప్ లాక్ ఇవ్వడమే కాకుండా రెచ్చిపోయి రొమాంటిక్ సీన్స్ లో నటించింది కృతి. ఈ సినిమాలో కృతి పూర్తిగా మోడ్రన్ క్యారెక్టర్ చేసింది. ఇందులో కృతిశెట్టి సిగరెట్ తాగే సన్నివేశాలు, నానికి లిప్ లాక్ ఇచ్చే సన్నివేశాలు, నానితో వీర లెవెల్లో రొమాన్స్ సీన్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

RGV : నక్సలైట్ గెటప్‌లో హల్‌చల్ చేసిన ఆర్జీవీ

అయితే ఈ సినిమా మంచి విజయం సాధించింది. అన్నీ చోట్ల ‘శ్యామ్ సింగరాయ్’కి మంచి టాక్ వస్తుంది. ఇందులో కృతి పాత్ర చూసి అభిమానులు ఇంకా పెరిగారు బేబమ్మకి. ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో తాజాగా కృతి మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో రొమాంటిక్ సన్నివేశాలు, లిప్ లాక్ ల గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. కృతి ఇలాంటి సీన్స్ గురించి మాట్లాడుతూ…. ”బోల్డ్‌ సీన్స్ , లిప్‌లాక్‌ సన్నివేశాలను చాలా మంది చులకన భావంతో చూస్తారు. అలంటి సీన్స్ లో నటించే కథానాయికలను కూడా కొంతమంది తక్కువ చేసి చూస్తారు. వాళ్ళ కెరీర్‌ ఇబ్బందుల్లో పడుతుందని అనుకుంటారు. కానీ నా వరకు లిప్‌లాక్‌ కూడా నటనలో భాగమేనని నమ్ముతాను. యాక్షన్‌ సీన్స్‌లానే బోల్డ్‌ సీన్స్‌లోనూ నటిస్తాను. వాటిని ప్రత్యేకంగా చూడను. హీరో హీరోయిన్స్ మధ్య ఉన్న కంఫర్ట్‌ రిలేషన్ ని బట్టే లిప్‌లాక్‌ సీన్స్‌, రొమాంటిక్ సీన్స్ బాగా వస్తాయి. కథలో అవసరమైతే రొమాన్స్ సీన్స్ చేయడానికి రెడీనే. కానీ అవసరం లేకపోయినా లిప్‌లాక్‌ సన్నివేశాలను పెడితే నేను ఒప్పుకోను” అని బోల్డ్ గా మాట్లాడేసింది.

RGV Hotel : గోదావరి జిల్లాల్లో ఆర్జీవీ హోటల్

ఇక రెండో సినిమాకే ఈ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేసింది అంటే ముందు ముందు భవిష్యత్తులో ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తుందో అని అంచనా వేస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలని బట్టి ఫ్యూచర్ లో మరిన్ని రొమాంటిక్ సీన్స్ చేయడానికి కృతిశెట్టి వెనుకాడదు అని తెలుస్తుంది.