Allu Arjun – Kriti Sanon : నేషనల్ అవార్డు విన్నర్స్ బన్నీ, కృతి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందా..?

నేషనల్ అవార్డు విన్నర్స్ అల్లు అర్జున్, కృతి సనన్ కాంబినేషన్‌లో ఒక సినిమా రాబోతోందా..? వైరల్ అవుతున్న కృతి పోస్ట్.

Kriti Sanon manifesting a film with Allu Arjun post viral

Allu Arjun – Kriti Sanon : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప (Pushpa) సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్న విషయం అందరికి తెలిసిందే. అలాగే బాలీవుడ్ భామ కృతిసనన్ కూడా మిమి (Mimi) చిత్రానికి జాతీయ పురస్కారం అందుకుంది. దీంతో బన్నీ అండ్ కృతి సోషల్ మీడియా ద్వారా ఒకర్ని ఒకరు అభినందించుకున్నారు. ఈక్రమంలోనే కృతి చేసిన ఒక పోస్ట్.. నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Teja Sajja : 28 ఏళ్ళ వయసు.. 25 ఏళ్ళు అనుభవం.. తేజ సజ్జ ఎమోషనల్ పోస్ట్!

“ఇద్దరు కలిసి నటించే సినిమా కోసం సిద్ధంగా ఉన్నా. నా ఫేవరెట్ సుకుమార్ గారితో కలిసి పుష్ప 2 చూసేందుకు నేను ఎదురు చూస్తున్నాను” అని ట్వీట్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్స్.. ఒకవేళ పుష్ప 2 లో ఐటెం సాంగ్ కి కృతిని సెలెక్ట్ చేశారా..? అని ప్రశ్నిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరిద్దరూ పుష్ప సినిమాతోనే స్క్రీన్ పై కనిపిస్తారా..? లేదా మరో మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తారో..? అనేది చూడాలి. వీరిద్దరి జంట స్క్రీన్ పై చాలా ఫ్రెష్ గా ఉంటుందని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Samantha – Vennela Kishore : సమంత నిర్మాణంలో వెన్నల కిశోర్ మెయిన్ లీడ్‌తో మూవీ..!

కాగా అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను త్రివిక్రమ్, సందీప్ వంగ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలోనే రాబోతున్నాయి అని బన్నీ తెలియజేశాడు. వీటిలో ఏదొక చిత్రంలో అయితే కృతి ఎంపిక అయ్యే ఛాన్స్ ఉంటుంది. కృతి తెలుగు ఇండస్ట్రీలోనే కెరీర్ స్టార్ట్ చేసింది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘1 నేనొక్కడినే’ చిత్రంలో మహేష్ బాబుకి హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత నాగచైతన్య ‘దోచేయ్’ సినిమాలో కూడా నటించింది. రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఇక్కడ పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ వెళ్లి అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.