Kshana Kshanam : ఆహా లో ‘క్షణం క్షణం’..

తొలి తెలుగు ఓటీటీ రోజురోజుకీ ఆడియెన్స్‌కి మరింత చేరువవుతోంది.. బ్లాక్ బస్టర్ సినిమాలతో డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అందరితోనూ ‘ఆహా’ అనిపించుకుంటోంది. ఇటీవల ‘క్రాక్’, ‘నాంది’ వంటి సూపర్ డూపర్ మూవీస్ ప్రేక్షకులకందించిన ఆహా ఇప్పుడు క్షణం క్షణం’క సినిమాను తీసుకొస్తోంది.

Kshana Kshanam : ఆహా లో ‘క్షణం క్షణం’..

Kshana Kshanam Movie Premieres From March 19 Only On Aha

Updated On : March 16, 2021 / 6:10 PM IST

Kshana Kshanam: తొలి తెలుగు ఓటీటీ రోజురోజుకీ ఆడియెన్స్‌కి మరింత చేరువవుతోంది.. బ్లాక్ బస్టర్ సినిమాలతో డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తూ అందరితోనూ ‘ఆహా’ అనిపించుకుంటోంది. ఇటీవల ‘క్రాక్’, ‘నాంది’ వంటి సూపర్ డూపర్ మూవీస్ ప్రేక్షకులకందించిన ఆహా ఇప్పుడు ‘క్షణం క్షణం’ సినిమాను తీసుకొస్తోంది.

Kshana Kshanam

మన మూవీస్ బ్యానర్‌లో ఉదయ్ శంకర్, జియా శర్మ హీరో హీరోయిన్లుగా కార్తీక్ మేడికొండ దర్శకత్వంలో డాక్టర్ వర్లు నిర్మించిన సినిమా ‘క్షణ క్షణం’. డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా మార్చి 19 నుండి ఆహాలో అందుబాటులోకి రానుంది.

ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘‘నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం శ్రీరామ్ గారు. ఆయన నాకు గురు సమానులు. వారి అబ్బాయి ఉదయ్ హీరోగా నటిస్తున్న ఈ ‘క్షణ క్షణం’ సినిమా బాగుందని విన్నాను. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకు పని చేసిన అందరూ నటీనటులకు టెక్నీషియన్స్‌కు బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. నిర్మాతగా మారిన డాక్టర్ వర్లు గారు మరిన్ని సక్సెస్‌ఫుల్ సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నాను’’.. అన్నారు.