Samantha : ఖుషీ షూటింగ్ మొదలుపెట్టిన టీం.. ఉమెన్స్ డే రోజు సామ్ కి గ్రాండ్ వెల్కమ్

తాజాగా సమంత మాయోసైటిస్ తో పోరాడి ఖుషి సినిమా షూటింగ్ కి సమంత తిరిగి వచ్చినందుకు చిత్రయూనిట్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మార్చ్ 8 ఉమెన్స్ డే రోజు సమంత ఖుషి సెట్స్ లో అడుగుపెట్టింది. సమంతకి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ.............

Samantha : ఖుషీ షూటింగ్ మొదలుపెట్టిన టీం.. ఉమెన్స్ డే రోజు సామ్ కి గ్రాండ్ వెల్కమ్

Kushi Movie unit grand welcome to Samantha for shoot on women's day

Updated On : March 9, 2023 / 7:15 AM IST

Samantha :  స్టార్ హీరోయిన్ సమంత మాయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే వరుస షూటింగ్స్ లో పాల్గొంటుంది. ఓ పక్కన షూటింగ్స్ లో పాల్గొంటూనే మరోపక్క ప్రమోషన్స్ చేస్తోంది. మళ్ళీ రెగ్యులర్ గా జిమ్ కి వెళ్తూ కష్టపడుతుంది. జిమ్ లో కష్టపడే వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మళ్ళీ ఫుల్ యాక్టివ్ అయింది సమంత. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ అయింది సమంత. దీంతో సామ్ ఫ్యాన్స్ సమంత బ్యాక్ టు వర్క్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సమంత బాలీవుడ్ లో సిటాడెల్ సిరీస్ చేస్తోంది. అలాగే సమంత చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. ఇన్ని రోజులు సమంత ఆరోగ్యం బాగోలేకపోవడంతో సమంత, విజయ్ దేవరకొండ జంటగా తెరకెక్కుతున్న ఖుషి సినిమా షూట్ ఆగింది. ఇప్పుడు సమంత బ్యాక్ టు వర్క్ అవ్వడంతో ఖుషి సినిమా షూట్ కూడా మొదలుపెట్టారు.

Sathi Gani Rendu Ekaralu : సత్తిగాని రెండు ఎకరాలు.. ఆహాలో మరో సరికొత్త సినిమా టీజర్ రిలీజ్..

Kushi Movie unit grand welcome to Samantha for shoot on women's day

తాజాగా సమంత మాయోసైటిస్ తో పోరాడి ఖుషి సినిమా షూటింగ్ కి సమంత తిరిగి వచ్చినందుకు చిత్రయూనిట్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మార్చ్ 8 ఉమెన్స్ డే రోజు సమంత ఖుషి సెట్స్ లో అడుగుపెట్టింది. సమంతకి గ్రాండ్ వెల్కమ్ చెప్తూ బ్యానర్ ఏర్పాటు చేసి, సామ్ తో కేక్ కట్ చేయించి సెట్ లో సందడి చేశారు చిత్రయూనిట్. విజయ్ దేవరకొండ, డైరెక్టర్ శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్.. పలువురు చిత్రయూనిట్ అంత కలిసి ఉమెన్స్ డే రోజు సమంతకి ఖుషి సెట్ లోకి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. దీంతో సామ్ ఫ్యాన్స్ తో పాటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఖుషి సినిమా షూట్ పూర్తి చేసి రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.