NTR Japan Fans : జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదు.. ఆటోగ్రాఫ్‌ల కోసం చుట్టుముట్టిన లేడీ ఫ్యాన్స్.. ఒక అమ్మాయి అయితే..

ఎన్టీఆర్ జపాన్ కి వెళ్లడంతో అక్కడి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

Lady Fans from Japan Impressed NTR he Shares Special Video

NTR Japan Fans : మన తెలుగు హీరోలకు, తెలుగు సినిమాలకు ఇటీవల కొన్నాళ్ల నుంచి జపాన్ లో ఫుల్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. దీంతో మన హీరోలు అక్కడికి వెళ్తే, మన సినిమాలు అక్కడ రిలీజయితే గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. దేవర సినిమా జపాన్ లో మార్చ్ 28న రిలీజ్ అవుతుంది. దీంతో గత నాలుగు రోజులుగా ఎన్టీఆర్ జపాన్ లోనే ఉండి ప్రమోషన్స్ భారీగా చేస్తున్నాడు.

ఎన్టీఆర్ జపాన్ కి వెళ్లడంతో అక్కడి ఫ్యాన్స్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఎన్టీఆర్ తో స్టెప్పులు వేశారు. ఎన్టీఆర్ ని చూడటానికి ఎగబడ్డారు. ఎన్టీఆర్ తో ఫోటోలు దిగడానికి, ఆటోగ్రాఫ్ లు తీసుకోడానికి కూడా ఎగబడ్డారు. తాజాగా కొంతమంది లేడీ ఫ్యాన్స్ తో మీట్ నిర్వహించగా అక్కడికి వచ్చిన అమ్మాయిలు ఎన్టీఆర్ ని చుట్టుముట్టారు.

Also Read : Rashmika Mandanna : ఇంకా గాయం నుంచి కోలుకొని రష్మిక.. కాలి గాయంపై రష్మిక ఏం చెప్పిందంటే..

లేడీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ తో ఆటోగ్రాఫ్ లు తీసుకోడానికి ఎగబడ్డారు. ఒక అమ్మాయి అయితే ఎన్టీఆర్ కోసం తెలుగు నేర్చుకున్నాను అని తెలుగు నేర్చుకుంటున్న ఓ బుక్ కూడా చూపించింది. ఆ బుక్ పై ఆటోగ్రాఫ్ తీసుకుంది. ఎన్టీఆర్ అమ్మాయిలకు ఆటోగ్రాఫ్ లు ఇస్తున్న వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

ఈ వీడియో షేర్ చేస్తూ.. నేను జపాన్ కి ఎప్పుడు వెళ్లినా బ్యూటిఫుల్ జ్ఞాపకాలు ఉంటాయి. కానీ ఇది డిఫరెంట్. ఒక జపనీస్ అభిమాని RRR చుసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను అని చెప్పింది. ఒక సినిమా, భాషా ప్రేమికుడిగా సినిమా భాషలకు, కల్చర్ కు ఒక వారధిలా నిలబడి ఒక ఫ్యాన్ కొత్త భాష నేర్చుకోవడం అనేది నేను మర్చిపోలేను. ఇండియన్ సినిమాని సెలబ్రేట్ చేసుకోడానికి ఇది ఇంకో రీజన్ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఎన్టీఆర్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.