Rashmika Mandanna : ఇంకా గాయం నుంచి కోలుకొని రష్మిక.. కాలి గాయంపై రష్మిక ఏం చెప్పిందంటే..
కాలికి గట్టిగానే దెబ్బ తగలడంతో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ కూడా తీసుకుంది.

Rashmika Mandanna Still not Recovering from Leg Injury
Rashmika Mandanna : రష్మిక మందన్న ఇటీవల పుష్ప 2, చావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ బ్లాక్ బస్టర్స్ కొట్టింది. ఇప్పుడు సికందర్ సినిమాతో రానుంది. ఇటీవల కొన్ని రోజుల క్రితం రష్మిక జిమ్ లో గాయపడింది. కాలికి గట్టిగానే దెబ్బ తగలడంతో కొన్ని రోజులు బెడ్ రెస్ట్ కూడా తీసుకుంది. తాను బెడ్ మీద కాలి గాయంతో ఉన్న ఫోటోలు షేర్ చేసి స్వయంగా ఈ విషయం తెలిపింది రష్మిక.
ఆ గాయం తర్వాత చావా ప్రమోషన్స్ లో రష్మిక వీల్ చైర్ లోనే వచ్చింది. కుంటుకుంటూ కూడా ప్రమోషన్స్ కి వచ్చింది. ఇటీవల సికందర్ సినిమాలో మాత్రం మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది. దీంతో రష్మిక కాలి గాయం తగ్గింది అని అంతా భావించారు. కానీ రష్మిక ఇంకా గాయం నుంచి కోలుకోలేదని చెప్పి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. తాజాగా రష్మిక ఇన్‌స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో చిట్ చాట్ నిర్వహించగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
ఈ క్రమంలో ఓ ఫ్యాన్ కాలి గాయం తగ్గిందా అని అడగ్గా.. కాలు ఇంకా రికవర్ అవుతూనే ఉంది. మొత్తం తగ్గడానికి ఇంకా 9 నెలలు పడుతుంది. ప్రస్తుతానికి కాస్త బెటర్ గానే ఉంది. అలాగే నేను పనిచేయడం మొదలుపెట్టాను అని తెలిపింది. దీంతో రష్మిక పూర్తిగా కోలుకోడానికి ఇంకా 9 నెలలు పడుతుంది కానీ అలాగే జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ కి వెళ్తుంది అని తెలుస్తుంది. ఈ విషయం చెప్పడంతో రష్మిక త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.