Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ స్క్రిప్ట్ మొత్తం మార్చారా? 2026లో రిలీజ్.. నిర్మాత రవిశంకర్ వ్యాఖ్యలు వైరల్..
తాజాగా సినిమా నిర్మాత, మైత్రి అధినేతల్లో ఒకరైన రవిశంకర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అప్డేట్ ఇచ్చారు.

Producer Ravishankar gives Pawan Kalyan Harish Shankar Ustaad Bhagat Singh Update
Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ రాజకీయాల బిజీ వల్ల చేతిలో ఉన్న సినిమాలకు కూడా డేట్స్ ఇవ్వట్లేదని తెలిసిందే. వీరమల్లు, OG తర్వాత పవన్ ఇంక సినిమాలు చేయరని అంతా అనుకున్నారు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ మాట్లాడుతూ.. నాకు నటన ఒక్కటే ఆదాయమార్గం. నాకు డబ్బులు అవసరం ఉన్నంతకాలం సినిమాలు చేస్తాను. కుదిరినప్పుడల్లా డేట్స్ ఇస్తాను అని చెప్పారు.
దీంతో పవన్ సినిమాలపై మళ్ళీ ఆశలు చిగురించాయి. ఆగిపోయాయి అనుకున్న సినిమాలు కూడా మళ్ళీ ఉంటాయని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనౌన్స్ చేసి ఓ షెడ్యూల్ షూట్ చేసి ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. కానీ ఆ సినిమా ఆగిపోయిందనే అంతా అనుకున్నారు. తాజాగా సినిమా నిర్మాత, మైత్రి అధినేతల్లో ఒకరైన రవిశంకర్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అప్డేట్ ఇచ్చారు.
రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడగా తమ సంస్థ నుంచి 2026లో భారీ సినిమాలు, పెద్ద హిట్ అయ్యే సినిమాలు వస్తాయని చెప్పారు రవిశంకర్. ఈ క్రమంలో పవన్ సినిమా గురించి మాట్లాడుతూ.. కళ్యాణ్ గారి సినిమా హరీష్ శంకర్ స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసి పెట్టాడు. స్క్రిప్ట్ అదిరిపోయింది. ఈ సంవత్సరం షూట్ చేసి 2026లో రిలీజ్ చేస్తాం. కళ్యాణ్ గారి సినిమా అంటే పాన్ ఇండియా కంటే ఎక్కవ బజ్ ఉంటుంది. సినిమా కూడా అదే రేంజ్ లో పెద్ద హిట్ అవుతుంది అని తెలిపారు.
దీంతో హరీష్ శంకర్ – ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోలేదు అని క్లారిటీ వచ్చేసింది. అయితే నిర్మాత చెప్పిన ప్రకారం స్క్రిప్ట్ మాత్రం చాలా వరకు మార్చి మళ్ళీ కొత్తగా ఫైనల్ చేసారని తెలుస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ విజయ్ తేరి సినిమా రీమేక్ అని, ఎన్నికల ముందు పవన్ కి ఉపయోగపడేలా డైలాగ్స్ రాసుకున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు చాలా గ్యాప్ రావడంతో పాటు తేరి బాలీవుడ్ రీమేక్ ఫ్లాప్ అవ్వడంతో హరీష్ శంకర్ ఉస్తాద్ స్క్రిప్ట్ ని చాలా మార్పులు చేసి కొత్తగా రెడీ చేసాడని సమాచారం. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : L2E Empuraan : ‘L2E : ఎంపురాన్’ మూవీ రివ్యూ.. లూసిఫర్ సీక్వెల్ ఎలా ఉందంటే..?
పవన్ హరిహర వీరమల్లు సినిమాకు వారం రోజులు డేట్స్ ఇవ్వాలి. ఈ సినిమా మే 9న రిలీజ్ కానుంది. OG సినిమాకు మూడు వారాల డేట్స్ ఇవ్వాలి. ఉస్తాద్ భగత్ సింగ్ కి చాలానే డేట్స్ ఇవ్వాలి. పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న బిజికి వీటన్నిటికీ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో, ఫ్యాన్స్ తెరపై పవర్ స్టార్ ని ఎప్పుడు చూస్తారో చూడాలి మరి.