MM Srilekha : లేడీ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ 25 ఇయర్స్ జర్నీ.. 25 దేశాల్లో 25 మంది సింగర్స్‌తో స్పెషల్ టూర్..

 సంగీత దర్శకుల్లో లేడీ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వేళ్ళ మీద లెక్కపెట్టేంత మంది లేడీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు MM శ్రీలేఖ. కీరవాణి ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీలేఖ ప్రస్తుతం టాలీవుడ్ లో సంగీత దర్శకురాలిగా, సింగర్ గా...................

Lady Music Director MM Srilekha 25 years music journey special program in 25 countries with 25 singers

MM Srilekha :  సంగీత దర్శకుల్లో లేడీ మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. వేళ్ళ మీద లెక్కపెట్టేంత మంది లేడీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరు MM శ్రీలేఖ. కీరవాణి ఫ్యామిలీ నుంచి వచ్చిన శ్రీలేఖ ప్రస్తుతం టాలీవుడ్ లో సంగీత దర్శకురాలిగా, సింగర్ గా బిజీగా ఉంది. తన 9వ ఏటనే పద్యగానం చేసి ఆ తరువాత 12 సంవత్సరాల వయసులోనే పాటలు పాడటం, సంగీతం కంపోజ్ చేయడం మొదలుపెట్టింది. సురేష్ ప్రొడక్షన్స్ లో వచ్చిన తాజ్ మహల్ సినిమా శ్రీలేఖకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తరువాత ఒక్క సురేష్ ప్రొడక్షన్ లోనే అత్యధికంగా 13 మ్యూజికల్ హిట్ సినిమాలకు సంగీతం అందించింది.

రీసెంట్ గా వచ్చిన హిట్ 2 సినిమాలో శ్రీలేఖ సంగీతం అందించిన ‘ఉరికే ఉరికే..’ అనే రొమాంటిక్ సాంగ్ కు సిద్ శ్రీరామ్ అద్బుత‌మైన గొంతుతో పాడి ప్రేక్షకులకు మైమరపింపచేశాడు.ఇలా ఇప్పటివరకు తను 5 భాషల్లో 80 సినిమాలకు పైగా సంగీతం అందించిన ఏకైక మహిళా మ్యూజిక్ డైరెక్టర్ గా పలు రికార్డులని కూడా సృష్టించింది. శ్రీలేఖ సినిమా రంగంలోకి వచ్చిన తను ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇండియా, ఖాతర్, యు.ఏ.ఈ, బహ్రెయిన్, కువైట్, ఒమన్, నార్వే, యు.కె, ఐర్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్ , స్వీడెన్, ఫిన్ ల్యాండ్, సౌత్ ఆఫ్రికా, టాంజానియా, నైజీరియా, యు.యస్.ఏ, బోట్స్ వానా, కెనడా, సింగపూర్, మలేసియా, హాంగ్ కాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మొదలగు 25 దేశాల్లో 25 మంది సింగర్స్ తో ఈ నెల 17 నుండి వరల్డ్ మ్యూజిక్ టూర్ ప్రోగ్రాం స్టార్ట్ చేయనున్నారు.

గత నెలలోనే దర్శకులు రాజమౌళి శ్రీ లేఖ వరల్డ్ మ్యూజిక్ టూర్ పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా ఈ టీం అంతా ఈ నెల 17న బయలు దేరుతున్న సందర్బంగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో గ్రాండ్ గా ఓ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ హై కోర్ట్ జడ్జ్ నంద, రచయిత విజయేంద్ర ప్రసాద్, కమెడీయన్ ఆలీ, సంగీత దర్శకులు కోటి, దర్శకులు ముప్పల నేని శివ, చంద్ర మహేష్, వేణు శ్రీరంగం, భారతీ బాబు, శైలేష్ కొలను, వై. వి యస్. చౌదరి, గేయ రచయిత చంద్ర బోస్, లిరిసిస్ట్ భాస్కరబట్ల, లక్ష్మీ భూపాల్.. మరింతమంది సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Kangana Ranaut : కంగనా రనౌత్ ఫేవరేట్ సినిమాలు ఇవే.. మీరు చూశారా?

ఈ ఈవెంట్ లో శ్రీలేఖ మాట్లాడుతూ.. నా 25 సంవత్సరాల జర్నీలో ఆస్తులు కూడబెట్టకపోయినా నా పాటలతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకొన్నాను అంటూ ఎమోషనల్ అయింది.