Kangana Ranaut : కంగనా రనౌత్ ఫేవరేట్ సినిమాలు ఇవే.. మీరు చూశారా?

కంగనా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. తన గురించి కూడా అన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది. తాజాగా కంగనా తన ఫేవరేట్ సినిమాలను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ నా ఫేవరేట్ 8 సినిమాలు ఇవే................

Kangana Ranaut : కంగనా రనౌత్ ఫేవరేట్ సినిమాలు ఇవే.. మీరు చూశారా?

Kangana Ranaut favourite top 8 movies list

Updated On : March 8, 2023 / 6:37 AM IST

Kangana Ranaut :  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం వుమన్ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది. వరుసగా వుమెన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. ఇక దేశం, ధర్మం గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తనని ఎవరన్నా విమర్శించినా ఫైర్ అవుతుంది. బాలీవుడ్ మాఫియాపై ఓపెన్ గానే అందరిపై విమర్శలు చేస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ మాఫియాతో కలవకుండా సపరేట్ గా చాలా వరకు సింగిల్ గానే ఉంటుంది కంగనా. దేశంలో జరిగే పలు రకాల సంఘటనలపై రెగ్యులర్ గా రియాక్ట్ అవుతుంది కంగనా.

కంగనా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ పలు అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. తన గురించి కూడా అన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటుంది. తాజాగా కంగనా తన ఫేవరేట్ సినిమాలను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ నా ఫేవరేట్ 8 సినిమాలు ఇవే.. చూడకపోతే చూసేయండి అని లిస్ట్ ఇచ్చింది.

Kangana Ranaut : బాలీవుడ్ యువ హీరోపై కంగనా వ్యాఖ్యలు.. ఆ హీరో ఏమన్నాడో తెలుసా??

కంగనా లిస్ట్ లో ఉన్న సినిమాలు.. అమేడియస్, ది శ్వాశాంక్ రెడెంప్షన్, అమెరికన్ బ్యూటీ, ప్యాసా, అమౌర్, సెవెన్ ఇయర్ ఇచ్, ఇంటర్ స్టెల్లార్, ది నోట్ బుక్. ఇందులో ఒక్క ప్యాసా సినిమా తప్ప మిగిలినవన్నీ విదేశీ సినిమాలే. ప్యాసా గురుదత్ తెరకెక్కించిన హిందీ సినిమా. కంగనా ఈ సినిమాల లిస్ట్ చెప్పడంతో అభిమానులు ఈ సినిమాలు చూడటానికి ఫిక్స్ అయ్యారు. మీరు కూడా ఎవరన్నా చూడకపోతే ఈ సినిమాలు చూసేయండి.

 

Kangana Ranaut Favourite Movies list