Kangana Ranaut : బాలీవుడ్ యువ హీరోపై కంగనా వ్యాఖ్యలు.. ఆ హీరో ఏమన్నాడో తెలుసా??

కంగనా ఇటీవల ట్విట్టర్లో #ASKKangana పేరుతో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. పలువురు అభిమానులు, నెటిజన్లు ప్రశ్నలు అడగగా వాటికి సమాధానాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ గురించి..................

Kangana Ranaut : బాలీవుడ్ యువ హీరోపై కంగనా వ్యాఖ్యలు.. ఆ హీరో ఏమన్నాడో తెలుసా??

Kangana Ranaut comments on Kartika Aaryan and he reacts

Updated On : February 28, 2023 / 7:50 AM IST

Kangana Ranaut :  బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం వుమన్ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉంది. దేశం, ధర్మం గురించి ఎవరన్నా తప్పుగా మాట్లాడినా, తనని ఎవరన్నా విమర్శించినా ఫైర్ అవుతుంది. బాలీవుడ్ మాఫియాపై ఓపెన్ గానే అందరిపై విమర్శలు చేస్తుంది. దేశంలో జరిగే పలు రకాల సంఘటనలపై రెగ్యులర్ గా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతుంది కంగనా. బాలీవుడ్ మాఫియా కాకుండా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, విజయాలు సాధించిన వాళ్ళని కూడా అభినందిస్తూ ఉంటుంది.

కంగనా ఇటీవల ట్విట్టర్లో #ASKKangana పేరుతో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. పలువురు అభిమానులు, నెటిజన్లు ప్రశ్నలు అడగగా వాటికి సమాధానాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ బాలీవుడ్ యువ హీరో కార్తీక్ ఆర్యన్ గురించి అభిప్రాయం చెప్పమన్నాడు. దీనికి కంగనా అతను చాలా కష్టపడి పైకి వచ్చాడు. అతని దారిని సొంతంగా నిర్మించుకున్నాడు. బాలీవుడ్ లోని ఏ గ్రూప్ తో కూడా అతను కలవలేదు అంటూ మంచిగా చెప్పింది.

Acharya Movie Set : చిరంజీవి ఆచార్య సినిమా సెట్‌లో అగ్నిప్రమాదం.. కోట్ల రూపాయలు బుగ్గిపాలు..

ప్రస్తుతం వరుస సినిమాలతో ఉన్న యువ హీరో కార్తీక్ ఆర్యన్ తాజాగా బాలీవుడ్ లోని అవార్డు వేడుకలకు హాజరవ్వగా అక్కడ మీడియా వాళ్ళు కంగనా మీ గురించి ఇలా చెప్పింది, మీరేమంటారు అని అడిగారు. దీనికి కార్తీక్ ఆర్యన్ సమాధానమిస్తూ.. నన్ను అభినందించినందుకు ఆమెకు నా కృతజ్ఞతలు. ఆమె వర్క్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. అలాంటిది ఆమె లాంటి స్టార్ నుంచి ఇలాంటి అభినందన వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని తెలిపాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.