Dheera : లక్ష్ చదలవాడ ‘ధీర’ రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడో తెలుసా?
ఆల్రెడీ ధీర సినిమా నుంచి గ్లింప్స్, ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ధీర సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర యూనిట్.

Laksh Chadalavada Action Movie Dheera Release Date Announced
Dheera : ప్రస్తుతం యువ హీరోలు వరుసగా చిన్న చిన్న సినిమాలతో ప్రేక్షకులని మెప్పిస్తున్నారు. కొత్త కొత్త కంటెంట్స్ తో వస్తున్నారు. ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తనయుడు, యువ హీరో లక్ష్ చదలవాడ వరుస సినిమాలు చేస్తున్నాడు. చిన్నప్పుడే పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన లక్ష్ చదలవాడ హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు.. లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న లక్ష్ త్వరలో ‘ధీర’ సినిమాతో రాబోతున్నాడు.
విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మాణంలో ధీర సినిమా తెరకెక్కుతుంది. లక్ష్ చదలవాడ హీరోగా నటిస్తుండగా సోనియా బన్సల్, నేహా పతన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఆల్రెడీ ధీర సినిమా నుంచి గ్లింప్స్, ఓ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ధీర సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర యూనిట్.
Also Read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ నుంచి మరో సాంగ్ రిలీజ్.. ‘మావా ఎంతైనా..’ విన్నారా?
లక్ష్ చదలవాడ ధీర సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ సెన్సార్ కూడా పూర్తయినట్టు సమాచారం. సంక్రాంతి తర్వాత నుంచి ధీర ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నారు.