Lakshmi Bhupala : గుర్తుందా శీతాకాలం టైటిల్ ఎందుకు పెట్టారో తెలుసా??.. లవర్స్ కచ్చితంగా తెలుసుకోవాలి..
చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సినిమా రైటర్ లక్ష్మి భూపాల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని వెల్లడించారు. ఈ సినిమాకి గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ఎందుకు పెట్టారని అడగగా లక్ష్మి భూపాల.................

Lakshmi Bhupala says interesting story about gurtunda seetakalam title
Lakshmi Bhupala : సత్యదేవ్ హీరోగా, తమన్నా, మేఘ ఆకాష్, కావ్యాశెట్టి హీరోయిన్స్ గా రాబోతున్న సినిమా గుర్తుందా శీతాకాలం. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్‌టైల్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కించారు. ఇప్పటికే అనేక సార్లు వాయిదాపడిన ఈ సినిమా డిసెంబర్ 9న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
తాజాగా చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా సినిమా రైటర్ లక్ష్మి భూపాల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని వెల్లడించారు. ఈ సినిమాకి గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ ఎందుకు పెట్టారని అడగగా లక్ష్మి భూపాల.. అందరూ ఈ టైటిల్ గురించే అడుగుతున్నారు. సాధారణంగా ప్రేమికులకు ఎండాకాలంలో లవ్ స్టోరీలు బాగోవు. ఇక వానాకాలం అయితే పెళ్ళైన వాళ్ళకి మాత్రమే బాగుంటుంది. కానీ శీతాకాలంలో మాత్రం లవ్ స్టోరీలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. అందుకే ఈ సినిమాకి గుర్తుందా శీతాకాలం అని పేరు పెట్టారు అంటూ ఆసక్తికరంగా తెలిపారు.
Bandla Ganesh : తండ్రి మాట వినకపోతే బన్నీలాగా తయారవుతారు.. వింటే.. బండ్లగణేష్ వ్యాఖ్యలు..
అలాగే సత్యదేవ్ గురించి మాట్లాడుతూ.. తను నాకు చిన్నప్పటినుంచి తెలుసు. చాలా మంచి యాక్టర్. తనకి 90 ఏళ్ళ క్యారెక్టర్ ఇచ్చినా, 19 ఏళ్ళ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా పని చేస్తాడు అని తెలిపారు. తనని డైరెక్షన్ కూడా చేయమన్నారని, కానీ ఇప్పట్లో నాకు ఆ ఆసక్తి లేదని, నందిని రెడ్డి గారి అన్ని సినిమాలకి నేనే రాస్తానని కూడా తెలిపారు.