అదొక- షో.. ‘బిగ్‌బాస్’ ని ఎంత మాటనేసింది!..

Lakshmi Menon Comments – Bigg Boss Tamil Season 4: టెలివిజన్ అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ షో గురించి ఓ హీరోయిన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఎవరా హీరోయిన్? ఆమెకు బిగ్‌బాస్ అంటే ఎందుకంత కోపం అంటే.. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రసారమవుతుంది. తెలుగులో ఇప్పటికే నాలుగో సీజన్ ప్రసారమవుతుండగా తమిళ్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ వ్యాఖ్యతగా వ్యవహరించనున్న సీజన్-4 అక్టోబర్ 4 నుండి టెలికాస్ట్ కానుంది.
ఈ నేపథ్యంలో తమిళ్, మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ లక్ష్మీమీనన్ తమిళ బిగ్‌బాస్ 4లో కంటెస్టెంట్ అంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై లక్ష్మీమీనన్ ఘాటుగా స్పందించింది.
‘‘నేను బిగ్‌బాస్ షోలో పార్టిసిపేట్ చేయడం లేదు. నేను వేరేవాళ్లు తిన్న ప్లేట్స్‌ను కడగడం, టాయ్‌లెట్స్ శుభ్రం చేయడం వంటి పనులు ఇప్పటి వరకు చేయలేదు, చేయను కూడా. షో పేరుతో కెమెరాల ముందు ఫైటింగ్ చేయడం, నటించడం నాకు నచ్చదు. కాబట్టి ఇప్పటికైనా నేను ఏదో షిట్ షోలో పాల్గొంటానని వస్తున్న వార్తలకు సంబంధించి క్లారిటీ వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను’’ అని వ్యాఖ్యానించింది. పార్టిసిపేట్ చేస్తే, చేస్తున్నానని లేకపోతే లేదని చెప్పాలి కానీ ఇలా మాట్లాడడం తగదు అంటూ లక్ష్మీమీనన్‌కు సలహా ఇస్తున్నారు తమిళ ప్రేక్షకులు.