Chiranjeevi
Lal Singh Chaddha : బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్, ఓ ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మరియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘లాల్ సింగ్ చద్దా’ అనేక వాయిదాల అనంతరం ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమయింది. ఇటీవల బాలీవుడ్ హీరోలు తెలుగులో మార్కెట్ కోసం ట్రై చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అమీర్ ఖాన్ కూడా ఇక్కడ ప్రమోషన్స్ నిర్వహించబోతున్నారు.
ఇందులో నాగచైతన్య కూడా నటించడంతో గురువారం ఉదయం టాలీవుడ్ లో లాల్ సింగ్ చద్దా స్పెషల్ షో వేశారు అమీర్ ఖాన్. అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి మధ్య ఎప్పట్నుంచో స్నేహం ఉంది. ఇక నాగార్జున, చిరంజీవి స్నేహం గురించి తెలిసిందే. అందుకే చిరంజీవి ఇంట్లో ఈ సినిమాని ఓ స్పెషల్ ప్రివ్యూ వేశారు. ఈ ప్రివ్యూకి రాజమౌళి, నాగార్జున, సుకుమార్, చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్య.. మరియు పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని చిరంజీవి, రాజమౌళి మిగిలిన వాళ్ళు చూసి అమీర్ ఖాన్ ని అభినందించారు.
Aamir Khan : షూటింగ్‌లో గాయం.. అయినా షూటింగ్ ఆపని అమీర్ ఖాన్..
ఈ ప్రత్యేక ప్రివ్యూ తర్వాత చిరు ఇంట్లోనే వీరంతా సమావేశమయ్యారు. త్వరలోనే తెలుగులో లాల్ సింగ్ చద్దా ప్రమోషన్స్ ని మొదలుపెట్టనున్నారు. ఇందులో నాగ చైతన్య కూడా నటించడంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం నాగార్జున, చిరంజీవి, రాజమౌళి.. ఇలా టాలీవుడ్ అంతా తరలి రానుంది అమీర్ ఖాన్ కోసం. మరి ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి అమీర్ ఖాన్.