Aamir Khan : షూటింగ్‌లో గాయం.. అయినా షూటింగ్ ఆపని అమీర్ ఖాన్..

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపారు. బాలీవుడ్‌ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చద్దా సినిమా షూటింగ్‌లో.............

Aamir Khan : షూటింగ్‌లో గాయం.. అయినా షూటింగ్ ఆపని అమీర్ ఖాన్..

Aamir Khan

Aamir Khan :  అమీర్ ఖాన్ హీరోగా, నాగచైతన్య ముఖ్య పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ సినిమా ‘లాల్‌ సింగ్‌ చద్దా’. ఈ సినిమాను అమీర్ ఖాన్‌ ప్రొడక్షన్స్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌ బ్యానర్‌పై నిర్మించారు. హాలీవుడ్ సినిమా ఫారెస్ట్‌ గంప్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. అనేక వాయిదాల అనంతరం లాల్‌ సింగ్‌ చద్దా సినిమా ఆగస్టు 11న విడుదల కానుంది.

Aamir Khan : మేకప్‌మెన్‌గా మారిన బాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరికోసమో తెలుసా??

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపారు. బాలీవుడ్‌ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చద్దా సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. లాంగ్‌ రన్నింగ్‌ చేసే సీన్‌లో అమిర్ ఖాన్ కాలికి గాయమైంది అట. అయినా అమీర్ ఆ గాయాన్ని లెక్క చేయకుండా పరిగెట్టాడంట. ఫిజియోథెరపీ చేయించుకోవాలి, హాస్పిటల్‌కు వెళ్దామని అక్కడున్న చిత్ర యూనిట్ చెప్పినా కేవలం పెయిన్‌ కిల్లర్స్‌ వేసుకుని షూటింగ్ కంటిన్యూ చేసాడట అమీర్. ఎంత నొప్పిగా అనిపించినా భరిస్తూ షూట్ చేసాడని చిత్ర యూనిట్ తెలిపారు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్, నెటిజన్స్ అమీర్ ఖాన్ ని పొగుడుతూ అందుకే ఆయన్ని మిస్టర్‌ పర్ఫెక్ట్‌ అంటారు అని కామెంట్స్ చేస్తున్నారు.