Puneeth Rajkumar
Puneeth Rajkumar: కుర్ర హీరోలు ఉన్నపళంగా కుప్పకూలి చనిపోతున్నారు. ఆరాధించిన వారు దూరమవడంతో అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నో కష్టనష్టాలను ఎదురొడ్డి కెరీర్ లో ఒక స్థానాన్ని చూసేలోపే కన్నుమూయడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. గత ఏడాది యాక్షన్ కింగ్ మేనల్లుడు, హీరో చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించాడు. చిరంజీవి వయసు కూడా అప్పటికి 35 సంవత్సరాలే. చిన్న వయసులోనే గుండెపోటు.. ఆకస్మిక మరణాన్ని శాండల్ వుడ్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది.
Puneeth Rajkumar: పవర్ స్టార్ పునీత్ ఇక లేరు..!
అది మర్చిపోక ముందే ఇప్పుడు పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం. ఊహించనివిధంగా ఉదయం జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తుండగా కుప్పకూలిపోవడం.. ఆసుపత్రికి చేరేలోపే పరిస్థితి విషమించడం.. వైద్యులు ఎంత ప్రయత్నించినా తిరిగిరాని ప్రాణం. పునీత్ వయసు 46 ఏళ్ళు కాగా.. కన్నడ సినీ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ అంటే ఫిట్నెస్ కు పెట్టింది పేరు. వ్యాయామం చేయకుండా రోజు గడవని హీరో పునీత్. అందుకే 46 ఏళ్ల వయసులో కూడా యాక్షన్ నుండి డాన్స్ వరకు అన్నిటిలో యమా క్రేజ్ కనిపిస్తుంది.
Puneeth Rajkumar: మిస్ యూ పునీత్.. అభిమానుల కన్నీటి రోదన!
ఏదైతేనేం.. ఎంత ఫిట్నెస్ ఉన్నా పునీత్ మళ్ళీ తిరిగి రాడనే వార్త అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గత ఏడాది చిరంజీవి సర్జా.. ఇప్పుడు పునీత్ ఇలా ఆకస్మిక మరణాలు శాండల్ వుడ్ లో చర్చకు దారితీస్తున్నాయి. చిన్న వయసులో గుండెపోటు రావడం.. అది కూడా ఫిట్నెస్ కు ప్రాధాన్యమిచ్చే వారికి ఇలా జరగడంపై మిగతా నటీనటులలో ఆందోళన మొదలైంది. ఇలాంటి హీరోల వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ దాగి ఉంటుంది. మళ్ళీ ఇలాంటి హీరో ఇండస్ట్రీకి కావాలంటే.. మరో దశాబ్దం పడుతుంది. కానీ.. పునీత్ మళ్ళీ రాడనే నిజం.. ఫిట్నెస్ ఫ్రీక్స్ నటులు ఇలా దూరమవడంపై కన్నడ సీమకి తీరని నష్టం.