Jagjit Kaur : ప్రముఖ గాయని కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్‌ నేపథ్య గాయని జగ్జీత్‌ కౌర్‌ (93) కన్నుమూశారు. అనారోగ్య కార‌ణాల‌తో ముంబైలో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఆస్ప‌త్రితో చికిత్స..

Jagjit Kaur : ప్రముఖ గాయని కన్నుమూత

Jagjit Kaur

Updated On : August 15, 2021 / 9:32 PM IST

Jagjit Kaur : ప్రముఖ బాలీవుడ్‌ నేపథ్య గాయని జగ్జీత్‌ కౌర్‌ (93) కన్నుమూశారు. అనారోగ్య కార‌ణాల‌తో ముంబైలో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో ఆస్ప‌త్రితో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు(ఆగస్టు 15,2021) ఉదయం మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ముంబైలోని ఎస్‌విరోడ్‌లోని వైల్‌పర్లేలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించినట్లు చెప్పారు. బజార్‌ సినిమాలో దేఖ్‌లో ఆజ్‌ కా హుమ్‌కో, షోలా అవుల్‌ శబ్నం సినిమాలోని ఆఖేమిలనా.. పాటలకు కౌర్ స్వరం అందించారు.

కౌర్‌ భర్త మహమ్మద్‌ ఖయ్యం ప్రముఖ మ్యూజిక్ కంపోజర్‌. 1954లో జగ్జీత్‌ను వివాహం చేసుకున్నారు. ఖయ్యం.. త్రిషుల్‌, నూరీ, శోలా అవుల్‌ శబ్నంలకు కంపోజింగ్‌ చేశారు. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో 2019లో మరణించారు. జగ్జీత కౌర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.