×
Ad

Sarkaru Vaari Paata : స్పెయిన్‌లో సాలిడ్ పాట..

‘సర్కారు వారి పాట’ మ్యూజిక్ కంపోజిషన్స్ కంప్లీటెడ్.. అప్‌డేట్ సూన్..

  • Published On : October 22, 2021 / 05:18 PM IST

Sarkaru Vaari Paata

Sarkaru Vaari Paata: సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’.. మహేష్ పక్కన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

Allu Arha : అల్లు అర్హ పుట్టుకతోనే సూపర్‌స్టార్

ప్రస్తుతం స్పెయిన్‌లో సాంగ్స్ పిక్చరైజ్ చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు. రీసెంట్‌గా మ్యూజిక్ కంపోజిషన్ కంప్లీట్ అయినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ.. సూపర్ స్టార్‌తో తీసుకున్న పిక్ షేర్ చేశాడు తమన్. అలాగే ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుందో తెలిపేలా ఓ చిన్న వీడియా కూడా వదిలాడు.

సరికొత్త లుక్‌లో సూపర్ స్టైలిష్‌గా ఉన్నాడు మహేష్. కీర్తి సురేష్, మహేష్ లొకేషన్‌లో ఫ్యాన్స్‌తో తీసుకున్న పిక్స్ సోషల్ మీడయాలో వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబు బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేసిన బర్త్‌డే బ్లాస్టర్ వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా 2022 జనవరి 12న ‘సర్కారు వారి పాట’ విడుదల కానుంది.

Kriti Sanon : లెజెండ్ ఇంట్లో అద్దెకు దిగుతున్న ‘ఆదిపురుష్’ భామ