రాజశేఖర్ హెల్త్ అప్‌డేట్

Rajasekhar Health Update: యాంగ్రీ స్టార్ డా.రాజశేఖర్ సహా ఆయన కుటుంబ సభ్యులందరూ ఇటీవల కరోనా బారిన పడ్డారు. కుమార్తెలు శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇప్పటికే కరోనా నుంచి కోలుకోగా జీవిత ఇటీవల డిశ్చార్జ్ అయ్యారు. కాగా రాజశేఖర్ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. తాజాగా రాజశేఖర్ ఆరోగ్యపరిస్థితికి సంబంధించి సిటీ న్యూరో సెంటర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ప్రస్తుతం ఆయన అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని, ఆక్సిజన్ లెవల్స్ ఆరోగ్యకరంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు. అలాగే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు పేర్కొన్నారు. రాజశేఖర్ చికిత్సకు స్పందిస్తున్నారని, వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారని బులెటిన్‌లో పేర్కొన్నారు.
డాక్టర్ రత్న కిషోర్, మెడికల్ డైరెక్టర్
సిటీ న్యూరో సెంటర్-హైదరాబాద్.