Lavanya Tripathi : బాగా చూసుకునే భర్త వచ్చాడు.. లావణ్య స్పెషల్ పోస్ట్.. చీర మీద, చెప్పుల మీద.. ఎక్కడ చూసినా వరుణ్ లావ్..

తాజాగా లావణ్య తన పెళ్లి నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేసి ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోల్లో మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, వరుణ్ లావణ్య జంట ఫోటోలు ఉన్నాయి.

Lavanya Tripathi Special Post on Her Marriage and Shares Some Cute Photos

Lavanya Tripathi : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) కొన్నేళ్లుగా ప్రేమించుకొని ఇటీవల ఘనంగా ఇటలీలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, అతి కొద్దీ మంది సన్నిహితుల మధ్యే ఈ వివాహం జరిగింది. ఇక ఇటలీ వివాహం తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు నాగబాబు.

పెళ్లి దగ్గర్నుంచి ఈ జంట అప్పుడప్పుడు పలు ఫోటోలు పోస్ట్ చేస్తుంది. పెళ్లి అయిన దగ్గర్నుంచి వరుణ్ లావణ్య ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఇటీవలే దీపావళి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసి స్పెషల్ ఫోటోలు కూడా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ జంట లావణ్య ఇంటి దగ్గర డెహ్రాడూన్ లో ఉన్నట్టు సమాచారం.

తాజాగా లావణ్య తన పెళ్లి నుంచి కొన్ని ఫోటోలు షేర్ చేసి ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది. ఈ ఫొటోల్లో మెగా ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ, వరుణ్ లావణ్య జంట ఫోటోలు ఉన్నాయి. అలాగే లావణ్య స్పెషల్ గా తన చీర డిజైన్ చేయించింది. తన చీర మీద ‘వరుణ్ లావ్’ అని రాపించి ఇన్ఫినిటీ సింబల్ వేయించింది. అంటే వీళ్లిద్దరి ప్రేమ లెక్కలేనంత అని ఇండైరెక్ట్ గా చెప్తుంది. అలాగే తన చెప్పుల ఫోటోని కూడా షేర్ చేసింది. చెప్పుల మీద కూడా VL అని ప్రింట్ చేయించి స్పెషల్ గా డిజైన్ చేయించింది.

Also Read : Bigg Boss 7 Day 76 : ఇక నుంచి కెప్టెన్సీ టాస్క్ లు ఉండవు.. ఆ పదాలు బ్యాన్.. కంటెస్టెంట్స్ కి వీకెండ్ షాక్ ఇచ్చిన నాగార్జున..

ఇక ఈ ఫోటోలని షేర్ చేస్తూ లావణ్య.. నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన, నన్ను బాగా చూసుకునే వ్యక్తి ఇప్పుడు నా భర్త. నేను చెప్పడానికి చాలా ఉంది. కానీ దానిని మా మధ్యే ఉంచుకుంటాము. మేము కలలు కన్నట్టు మూడు రోజుల పెళ్లి మా కుటుంబాలతో, మా సన్నిహితులతో కలిసి చేసుకున్నాము. ఈ వేడుకని స్పెషల్ గా చేసినందుకు అక్కడికి వచ్చిన వారికి, మాకు బెస్ట్ విషెష్ చెప్పిన వారందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అంటూ పోస్ట్ చేసింది. దీంతో లావణ్య పోస్ట్ వైరల్ గా మారింది. ఇక పలువురు నెటిజన్స్ ఎంత లవ్ ఉంటే మాత్రం ఇలా చీర మీద, చెప్పుల మీద కూడా మీ పేర్లే వేయించుకుంటారా అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది చాలా క్యూట్ గా ఉన్నాయి అని కామెంట్స్ చేస్తున్నారు.