Laxman Sivaramakrishnan : సౌత్ ఇండియన్ కల్చర్ ని డీగ్రేడ్ చేస్తున్నారు.. సల్మాన్, చరణ్ సాంగ్ పై మాజీ క్రికెటర్ సంచనల వ్యాఖ్యలు..

ఇటీవలే కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా నుంచి 'ఏంటమ్మా..' అనే సాంగ్ విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఈ పాట ఉంది. ఈ పాటలో చరణ్ కూడా ఎంట్రీ ఇచ్చి వెంకటేష్, సల్మాన్ తో కలిసి మాస్ స్టెప్పులు వేశాడు.

Laxman Sivaramakrishnan :  సల్మాన్ ఖాన్(Salman Khan) హీరోగా, పూజా హెగ్దే(Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తున్న సినిమా కిసీకా భాయ్ కిసీకా జాన్(Kisi Ka Bhai Kisi Ka Jaan). ఈ సినిమాలో చాలా వరకు తెలుగు యాక్టర్స్ ఉన్నారు, సౌత్(South) నేటివిటీకి దగ్గరగా సినిమా చేస్తున్నారు. వెంకటేష్(Venkatesh) కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. సల్మాన్ ఈ సారి సౌత్ మార్కెట్ మీద కన్నేసి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు ఈ సినిమాతో. కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమాలో ఓ పాటలో రామ్ చరణ్(Ram Charan) కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

ఇటీవలే కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా నుంచి ‘ఏంటమ్మా..’ అనే సాంగ్ విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఈ పాట ఉంది. ఈ పాటలో చరణ్ కూడా ఎంట్రీ ఇచ్చి వెంకటేష్, సల్మాన్ తో కలిసి మాస్ స్టెప్పులు వేశాడు. ఇందులో లుంగీ అనే పదం వాడి స్టెప్పులు వేయించారు. అయితే ఇప్పుడు ఈ పాటపై విమర్శలు వస్తున్నాయి.

Shruti Haasan : శృతిహాసన్ పై ఫైర్ అవుతున్న టాలీవుడ్ ఆడియన్స్..

మాజీ టెస్ట్ క్రికెటర్, ప్రస్తుత కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ ఈ పాటని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ పాటలో సౌంత్ ఇండియన్ కల్చర్ ని దారుణంగా అవమానించారు. అది లుంగీ కాదు, ధోతి. సౌత్ ఇండియాలో సాంప్రదాయంగా కట్టుకునేది. దాన్ని ఇంత ఘోరంగా చూపించారు అని కామెంట్స్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కి మద్దతుగా అనేకమంది మరిన్ని కామెంట్స్ చేస్తూ ఈ పాటపై విమర్శలు చేశారు. కొంతమంది.. ఇది గుడిలో తీసిన సాంగ్, గుడిలో షూస్ వేసుకొని డ్యాన్స్ చేశారు అంటూ విమర్శించారు. మరి ఈ పాటపై వచ్చిన విమర్శలకు ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి.