Fauzi: ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్ నుండి ఫోటోలు లీక్.. మేకర్స్ సీరియస్ వార్నింగ్.. ఎవరైనా ఇక జైలుకే
ప్రభాస్ 'ఫౌజీ(Fauzi)' నుంచి లీకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేకర్స్.
Leaks from Prabhas Fauzi Movie Complaint Filed with Cyber Police
- ఫౌజీ టీమ్ సంచలన ప్రకటన
- మా శ్రమను దెబ్బతీయకండి
- ప్రభాస్ అభిమానులకు హను రాఘవపూడి విజ్ఞప్తి!
Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ‘ఫౌజీ(Fauzi)’ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. 1940ల నాటి పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. యుద్ధం నేపథ్యంలో సాగే హృద్యమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు హను తీర్చిదిద్దుతున్నారు. అయితే, తాజాగా ఫౌజీ షూటింగ్ సెట్స్ నుంచి ప్రభాస్ లుక్కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షం అయ్యాయి. దాంతో, చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.
Esther Anil: నడుము సొగసుతో సెగలు పుట్టిస్తున్న ‘దృశ్యం’ పాప.. ఎస్తర్ అనిల్ గ్లామర్ రచ్చ
వింటేజ్ లుక్‌లో ప్రభాస్ అద్భుతంగా ఉన్నప్పటికీ, సినిమాలోని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇలా బయటకు రావడంపై మేకర్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ లీకులపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఘాటుగా స్పందించింది. రాత్రింబగళ్లు కష్టపడి వెండితెరపై ఒక దృశ్యకావ్యాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటే, ఇలాంటి లీకులు తమ శ్రమను వృథా చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఫోటోలు వైరల్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అటు దర్శకుడు హను రాఘవపూడి కూడా స్పందిస్తూ, థియేటర్లలో ప్రేక్షకులకు కలిగే అసలైన మ్యాజిక్‌ను లీకులతో పాడు చేయవద్దని నెటిజన్లను కోరారు.
అనధికారిక కంటెంట్‌ను షేర్ చేయవద్దని చిత్ర బృందం అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఇక ఫౌజీ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించబోతుండగా, సోషల్ మీడియా బ్యూటీ ఇమాన్వీ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది విడుదల కానుంది.
