Latha Mangeshkar: స్వరరాగ గంగా ప్రవాహం ఆమె ప్రయాణం!

మాయదారి మహమ్మారి కరోనా మరో భారత ఆణిముత్యాన్ని మనకి దూరం చేసింది. గానకోకిలగా యావత్‌ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇకలేరు.

Latha Mangeshkar: మాయదారి మహమ్మారి కరోనా మరో భారత ఆణిముత్యాన్ని మనకి దూరం చేసింది. గానకోకిలగా యావత్‌ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇకలేరు. కరోనాతో జనవరి 11న ఆసుపత్రిలో చేరిన లతాజీ.. చికిత్స పొందుతూనే ఆదివారం ఉదయం తుది శ్వాసవిడిచారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్నట్లుగా ప్రకటించినా ముంబయిలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రిలో చికిత్సకి రెస్పాండ్ కాలేక మృతి చెందారు.

Latha Mangeshkar: నింగికేగిన స్వర శిఖరం.. స్ఫూర్తి గీతానికి తానే ఆదర్శం!

లతా గానానికి వసంతమే తప్ప శిశిరం లేదు. భావమే తప్ప భాష తెలీదు. ఆ గళంలో జాలువారే పాట వింటే ఆ గాన మాధుర్యానికి సాటి, పోటి రాగల గళం మరోకటి లేదనిపించేంతటి తీయని గానం ఆమెది. దశాబ్దాలు గడిచిన మాధుర్యం తరగని స్వరం ఆమె సొంతం. లతా మంగేష్కర్ ఈ పేరు తెలియని సంగీతాభిమానులుండరు. ఏడు దశాబ్దాలుగా ఎంతో మంది శ్రోతలను తన స్వర మాధుర్యంతో అలరిస్తూనే ఉంది స్వరం. వయసు తొంబైలో పడిన లత గాన మాధుర్యంలో ఎలాంటి మార్పు లేదు.

Lata Mangeshkar: విషాదం.. లతా మంగేష్కర్ కన్నుమూత

అది యుగళ గీతమైనా.. జానపదమైనా.. గజల్ గానమైనా.. ఖవ్వాలి రాగమైనా.. భక్తి గీతమైనా ఆమె గొంతులో అలవోకగా సాగాల్సిందే. ఎలాంటి సాహిత్యానికైనా తన స్వరంతో పట్టంకట్టే అపురూప గాన గీతికే లతా మంగేష్కర్. మహోన్నత శిఖరం ఎక్కిన వ్యక్తిని కింద నుంచి చూస్తే చుక్కలాగే కనిపిస్తారు. ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తే, అప్పుడు ఆ చిన్న చుక్క ఆకాశాన్ని తాకుతున్న వైనం మనకు అర్థమవుతుంది. మనం ఎన్ని అడుగులు అలా వేస్తూ వెళ్లినా ఆ చుక్క తారాస్థాయి ఉన్నతి మనకు అవగతమవుతూనే వస్తుంది. అలా సంగీత శిఖరాన్ని అధిరోహించిన మహోన్నత వ్యక్తి లతా మంగేష్కర్‌.

Lata Mangeshkar : లలితా మంగేష్కర్ బాల్యమంతా కష్టాలు, కన్నీళ్లే

వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ప్రయాణించిన లతా జీవన గమనం.. వేలకు వేలుగా ఆమె గాత్రం నుండి వచ్చిన గీతం.. ఈనాటి వరకు సాగిన స్వరరాగ గంగా ప్రవాహమే. భారతీయ సినీ సంగీతానికి మకుటంలేని మహారాణిగా.. 1987 నాటి రోజులకే 20 భాషలలో 30,000 వేల పాటలు పాడి ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ రికార్డును అందుకొని.. అసలు సిసలు కోయిల అనిపించుకున్నారు. గిన్నీస్ మాత్రమే కాదు.. ఇంటి ముంగిట వద్దకే అనేక అవార్డులు నడుచుకుంటూ వచ్చాయి.

Lata Mangeshkar : లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలు ఎన్నో తెలుసా ?

ఎన్‌టీఆర్‌, ఏఎన్నార్‌, మహారాష్ట్ర భూషణ్‌ అవార్డులను దక్కించుకున్నారు. గాత్ర సంగీతానికి మన దేశం అందించే భారతరత్న అత్యున్నత పురస్కారం అందుకున్న రెండోవ్యక్తి ఆమె. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కేంద్రం సన్మానించింది. లతాజీ నోట వినిపించని అందమైన రాగం లేదు. ఆమె పాటతో పరవశించని భారతీయ గీతాభిమాని లేడు. భజనలైనా, భక్తి సంకీర్తనలైనా, దేశభక్తి గీతమైనా, ప్రేమ గానమైనా, విషాద రాగమైనా, వియోగ భరిత ఆలాపన అయినా.. లతాజీ పాడిందే పాట. ఆమె నోట వినిపించిందే పాట.

ట్రెండింగ్ వార్తలు