Latha Mangeshkar: నింగికేగిన స్వర శిఖరం.. స్ఫూర్తి గీతానికి తానే ఆదర్శం!

మాయదారి మహమ్మారి కరోనా మరో భారత ఆణిముత్యాన్ని మనకి దూరం చేసింది. గానకోకిలగా యావత్‌ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇకలేరు.

Latha Mangeshkar: మాయదారి మహమ్మారి కరోనా మరో భారత ఆణిముత్యాన్ని మనకి దూరం చేసింది. గానకోకిలగా యావత్‌ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగిన లతా మంగేష్కర్ ఇకలేరు. కరోనాతో జనవరి 11న ఆసుపత్రిలో చేరిన లతాజీ.. చికిత్స పొందుతూనే ఆదివారం ఉదయం తుది శ్వాసవిడిచారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్నట్లుగా ప్రకటించినా ముంబయిలోని బ్రీచ్ క్యాడీ ఆసుపత్రిలో చికిత్సకి రెస్పాండ్ కాలేక మృతి చెందారు.

Lata Mangeshkar: విషాదం.. లతా మంగేష్కర్ కన్నుమూత

ఏడు దశాబ్దాల పాటు సంగీత ప్రియులను అలరించిన మధుర గానం లతా.. 1929 సెప్టెంబరు 28న ఇండోర్​లో జన్మించారు. తల్లిదండ్రులు దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతిలకు మొదటి సంతానం. సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడైన తండ్రి వద్ద ఐదేళ్ల వయుసులోనే ఓనమాలు నేర్చుకున్న లతాజీ.. 13 ఏళ్ల వయుసులో తండ్రి మరణానంతరం నటి, గాయనిగా సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రారంభంలో దాదాపు 8 చిత్రాల్లో నటించిన ఆమె.. 1942లో వచ్చిన ‘పహ్లా మంగళ్ గౌర్​’లో హీరోయిన్​ చెల్లెలుగా కనిపిస్తూ, రెండు పాటలు కూడా లతా పాడారు.

Lata Mangeshkar : లలితా మంగేష్కర్ బాల్యమంతా కష్టాలు, కన్నీళ్లే

లతా నేపథ్య గాయకురాలిగా ప్రస్థానం ప్రారంభించే సమాయంలో ఖుర్షీద్, నూర్జహాన్ గాయనిలుగా వెలుగుందుతున్నారు. అయితే, దేశ విభజన సమయంలో వీరు పాకిస్థాన్‌ వెళ్లడం.. నేపథ్య సంగీతానికి ప్రాధాన్యత పెరగడం లతా మంగేష్కర్​కు కలిసొచ్చింది. అయితే గాయానికి ఆమె ప్రయాణంలో తొలి అడుగు కష్టాల కడలే. ఆమె పాడిన తొలి పాటను తొలగించడంతో పాటు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఓ మరాఠి చిత్రం కోసం ఆమె పాడిన తొలి పాటను తొలగించగా.. ఆ తర్వాత ‘మజ్‌బూర్‌’లోని ‘దిల్ మేరా తోడా’ పాట పాడారు.

Lata Mangeshkar : లతా మంగేష్కర్ తెలుగులో పాడిన పాటలు ఎన్నో తెలుసా ?

లతా తొలి పాట విన్న వారంతా ఆమెను విమర్శించడంతో.. సవాలుగా తీసుకున్న ఈమె ఉర్దూలో సంగీత శిక్షణ తీసుకున్నారు. అనంతరం 1990లో సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన ‘లేఖిని’ సినిమాలో పాడిన ఓ పాటకు లతాజీకి జాతీయ అవార్డు వచ్చింది. అక్కడ నుండి ఆమె వెనుతిరిగి చూసుకొనే అవకాశం లేకుండా అవకాశాలు రావడం.. పాడిన ప్రతి పాట ఆమె గాత్ర ఆవిష్కరణకి ఓ మెట్టుగా మారి లతా ఓ శిఖరమయ్యారు. 1948 నుంచి 1978 వరకు 30వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ లతా పేరు సంపాదించారు.

ట్రెండింగ్ వార్తలు