సాహో టీమ్ దొంగతనం చేసింది: బాలీవుడ్ నటి తీవ్ర ఆరోపణలు

భారీ బడ్జెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో సినిమా హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో సాహో సినిమాపై కాపీ ఆరోపణలు వస్తున్నాయి. బాలీవుడ్ నటి లిసా రే సాహో మూవీ యూనిట్ పై కాపీ ఆరోపణలు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సాహో యూనిట్ ‘షిలో శివ్ సులేమాన్’ అనే మహిళ ఆర్టిస్టు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రభాస్, శ్రద్ధా కలిసి ఉన్న ‘బేబీ వోన్ట్ యూ టెల్ మీ’ అనే బ్యాక్‌గ్రౌండ్‌ను, దాంతో పాటు ఒరిజినల్ పోస్టర్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఈ రెండు ఫోటోల్లో బ్యాక్‌గ్రౌండ్ ఆర్ట్ వర్క్ అచ్చం ఒకేలా ఉంది.
దీనిపై స్పందించిన బాలీవుడ్ లిసా రే ఇన్ స్టాగ్రమ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసింది. ఓ భారీ బడ్జెట్ సినిమాలో షిలో ఆర్ట్ వర్క్‌ను కాపీ చేయడం తప్పు. ఇతరుల క్రియేటివిటీని అనుమతి లేకుండా వాడడం కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా దొంగతనమే.
ఈ ఆర్ట్ వర్క్‌ను వినియోగించుకునే ముందు సాహో యూనిట్ సంబంధిత యజమాని అనుమతి తీసుకోలేదు. కనీసం ఆమె పనికి తగిన గుర్తింపు కూడా ఇవ్వలేదు. ఇది ఎలా ఉందంటే.. ఎవరో దొంగ మీ ఇంట్లో చొరబడి మీ జీవితానికి, మీ జీవనోపాధికి, ఆత్మకు సంబంధించి అతి ముఖ్యమైన వస్తువును దొంగిలిస్తే ఎలా ఉంటుందో షిలో పరిస్థితి కూడా అంటూ లిసా రే ఉదాహరించింది.