Sai Marthand : ఊహించని కాంబో.. లిటిల్ హార్ట్స్ దర్శకుడితో అడివిశేష్ సినిమా.. నిర్మాత ఎవరో తెలుసా?
తాజాగా నేడు సాయి మార్తాండ్ అధికారికంగా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు. (Sai Marthand)
Sai Marthand
Sai Marthand : లిటిల్ హార్ట్స్ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ అందర్నీ తనవైపు తిప్పుకున్నాడు దర్శకుడు సాయి మార్తాండ్. రెండు కోట్లతో సినిమా తీసి ఏకంగా 30 కోట్లు సాధించి అందర్నీ మెప్పించి పెద్ద హిట్ కొట్టారు లిటిల్ హార్ట్స్ సినిమాతో. ఆ తర్వాత సాయి మార్తాండ్ పలువురు హీరోలతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
తాజాగా నేడు సాయి మార్తాండ్ అధికారికంగా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు. అడివి శేష్ డెకాయిట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. నా నెక్స్ట్ సినిమా అడివి శేష్ గారితోనే. గూఢచారి 2 అవ్వగానే మా సినిమా మొదలవుతుంది. ఆ సినిమాకు జగపతి బాబు, సునీల్ గారు నిర్మాతలు. అది ప్రేమ కథతో తెరకెక్కుతున్న సినిమా అని తెలిపాడు.
Also See : Pavithra Puri : పూల మధ్యలో పవిత్ర.. పూరి జగన్నాథ్ కూతురు ఎంత క్యూట్ గా ఉందో.. ఫొటోలు..
దీంతో ఈ కాంబోనా అని ఆశ్చర్యపోతున్నారు అంతా. థ్రిల్లర్, సస్పెన్స్ సినిమాలు చేసే అడివి శేష్ కామెడీ కథ రాసే సాయి మార్తాండ్ తో లవ్ స్టోరీ సినిమాకి ఓకే చెప్పడంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. పైగా ఈ సినిమా కోసం జగపతి బాబు, సునీల్ మొదటిసారి నిర్మాతలుగా మారడంతో మరింత చర్చగా మారింది ఈ స్పెషల్ కాంబో. గతంలోనే సాయి మార్తాండ్ లిటిల్ హార్ట్స్ సినిమా సమయంలో నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేసినా నిర్మాత మాత్రం జగపతి బాబు గారే. ఆయనే నాతో సినిమా చేస్తా అన్నారు. ఆయనకు మాట ఇచ్చాను అని తెలిపాడు.
