మహేష్ కుతురా.. మజాకా – సితార పాప స్టెప్స్ అదుర్స్
‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’ సాంగ్‌కు సూపర్బ్ స్టెప్పులేసిన మహేష్ కూతురు సితార.. వైరల్ అవుతున్న వీడియో..

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’ సాంగ్‌కు సూపర్బ్ స్టెప్పులేసిన మహేష్ కూతురు సితార.. వైరల్ అవుతున్న వీడియో..
సూపర్‌స్టార్ మహేశ్ బాబు, నమ్రతల గారాల పట్టీ సితార పాప మల్టీ ట్యాలెంటెడ్ అన్న విషయం తెలిసిందే. సితార పాప యూట్యూబ్‌లో వీడియోలు, ఇంటర్వ్యూలు చేస్తూనే.. మరోవైపు నాట్యం నేర్చుకుంటుంది. క్లాసికల్ డ్యాన్స్‌తో పాటు తన తండ్రి సినిమా పాటలకు ఔరా అనిపించేలా స్టెప్పులు వేస్తుంటుంది. సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కుమర్తె ఆద్య కలిసి ‘ఏ అండ్ ఎస్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. విభిన్న పోస్టులతో ఫాలోవర్స్‌ను పెంచుకుంటున్న ఈ చిచ్చర పిడుగులు.. ఇటీవల ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా హీరో మహేశ్ బాబు, హీరోయిన్ రష్మిక మందనలను ఇంటర్వ్యూ చేశారు.
తాజాగా సితార పాప మహేష్ లేటెస్ట్ సూపర్ హిట్ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలోని ‘డాంగ్ డాంగ్’ సాంగ్‌కు స్టెప్పులేసింది. ఆ పాటలో తమన్నా వేసిన స్టెప్పులను సితార అచ్చుగుద్దినట్టు వేయడం విశేషం. డాంగ్ డాంగ్ సాంగ్‌కు సితార చేసిన డ్యాన్స్‌ను నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసింది. తమన్నా ‘సో.. క్యూట్..’ అంటూ స్పందించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా సితార ప్రతిభను నెటిజన్లు కొనియాడుతున్నారు.
ప్రస్తుతం మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సక్సెస్‌ను మహేశ్ తన కుటుంబంతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే టూర్‌లో మహేశ్ తన మోకాలి శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. విశ్రాంతి అనంతరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో నటించనున్నాడు.