Lobo Bigg Boss 5 : అడ్డంగా దొరికిపోయిన లోబో..నెటిజన్ల ట్రోల్స్
వెరైటీగా కనిపించే ఈ లోబో...కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు యమ ట్రోల్ చేస్తున్నారు.

Lobo
Lobo Bigg Boss 5 : బిగ్ బాస్ (Bigg Boss) తెలుగు రియాల్టీ షో ఐదో సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వరుసగా మూడోసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా చెప్పిన ప్రకారం..సెప్టెంబర్ 05వ తేదీ ఆదివారం బుల్లితెరపై ‘బిగ్ బాస్ 5’ సందడి సందడిగా ప్రారంభమైంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లారు. ఆరో కంటెస్టెంట్ గా ‘లోబో’ వచ్చాడు. వెరైటీగా కనిపించే ఈ లోబో…కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు యమ ట్రోల్ చేస్తున్నారు. ఫన్నీ మీమ్స్ తో ట్విట్టర్ వేదికగా ట్వీట్లు చేస్తున్నారు.
Read More : Bigg Boss 5 : అవన్నీ రూమర్స్.. వచ్చేస్తున్నాడు ‘బిగ్ బాస్’..
ఇంతకు ఏముందా వీడియోలో…
వీడియోలో లోబో..ఓ యాంకర్ ఉన్నారు. బిగ్ బాస్ షో చూస్తుంటారా ? అని యాంకర్ అడగగా…బిగ్ బాస్ షోకు ఓ దండం, అది నా టేస్టు కాదంటూ నిర్మోహమాటంగా అభిప్రాయం చెప్పాడు. షోలో ఛాన్స్ రాకపోవడమే మంచిది..నాకు ఆ షో నచ్చదు అంటూ కుండబద్ధలు కొట్టాడు. ప్రస్తుతం లోబో చేసిన కామెంట్స్ ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ వీడియోకు ఫన్నీ మీమ్స్ పెడుతూ..కామెంట్స్ చేస్తున్నారు. ఛాన్స్ రానంత వరకు బిగ్ బాస్ షోను తిట్టడం, ఆ తర్వాత ప్లేటు మార్చడంపై లోబోపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Read More : Nagarjuna : ‘బిగ్ బాస్ 5’ షూటింగ్‌లో నాగార్జున.. లుక్ అదిరిందిగా..!
లోబో…ఇతని ధరించే దుస్తులు, నగలు..ఇతరత్రా వెరైటీగా ఉంటాయి. స్టైల్ కు తోడు..హైదరాబాద్ యాసలో యాంకరింగ్ చేస్తూ..జనాలను అలరిస్తున్నాడు. తాజాగా..బిగ్ బాస్ 5 సీజన్ లో అడుగుపెట్టాడు లోబో. చిన్నప్పటి నుంచి తనకు ఇలాగే ఉండడం ఇష్టమని, తన గురించి తండ్రిని తిట్టేవారని తెలిపాడు. ప్రతి శుక్రవారం తాను నాన్న సమాధి దగ్గరకు వెళుతానని, నాన్న ఉన్నప్పుడు విలువ ఇవ్వలేదని..ఇప్పుడా ఆ విలువ తెలుస్తోందని ఎమోషనల్ అయ్యాడు. మరి బిగ్ బాస్ పై గతంలో ఉన్న అభిప్రాయంపై ఇప్పుడు ‘లోబో’ ప్రస్తావిస్తాడా ? లేడా ? అనే చూడాలి.
#Lobo ?#BiggBossTelugu5pic.twitter.com/htDetbYrY0
— Why that (@HeeZG0ne) September 6, 2021