Site icon 10TV Telugu

Lokah Movie : మరోసారి వివాదం.. సూపర్ హిట్ సినిమాపై కర్ణాటక నెటిజన్ల విమర్శలు..

Lokah Movie Controversy in Bengaluru

Lokah Movie

Lokah Movie : ఇటీవల కర్ణాటక జనాలు భాష, ప్రాంతం, సినిమా.. ఇలాంటి పలు విషయాలతో వివాదాల్లో నిలుస్తూ చర్చగా మారుతున్నారు. ఇప్పటికే బెంగుళూరుకు వేరే వాళ్ళు రావొద్దని, తమ కన్నడ భాష మాట్లాడాల్సిందే అని, వేరే స్టేట్స్ వాళ్ళు వెళ్లిపోవాలని గొడవ చేస్తున్నారు. బెంగుళూరు వేరే దేశంలో లేదు అంటూ దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇక సినిమాలని సినిమాగా చూడకుండా అందులో కంటెంట్ ని కూడా విమర్శిస్తున్నారు.(Lokah Movie)

తాజాగా దుల్కర్ సల్మాన్ నిర్మాతగా కళ్యాణి ప్రియదర్శన్ మెయిన్ లీడ్ లో లోక చాప్టర్ 1 చంద్ర అనే సినిమా రిలీజయింది. సూపర్ వుమెన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. కేవలం 30 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా 90 కోట్ల గ్రాస్ వసూలు చేసి 100 కోట్లకు దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాపై కర్ణాటక నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Also Read : Director Krish : ఛ.. క్రిష్ తీసిన సీన్స్ ఉంటే హరిహర వీరమల్లు పెద్ద హిట్ అయ్యేది.. పార్ట్ 2 కూడా అవసర్లేదు.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్..

లోక సినిమాలో ఓ సీన్ లో బెంగుళూరు అమ్మాయిలను పెళ్లి చేసుకోను వాళ్ళు మంచోళ్ళు కాదు అనే డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ పై బెంగుళూరు అమ్మాయిలను విమర్శించారని ట్రోల్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో డ్రగ్స్ బిజినెస్ జరిగినట్టు కూడా చూపిస్తారు. దీంతో ఓ కన్నడ దర్శకుడు.. బెంగుళూరు అంటే ఇటీవల డ్రగ్స్, క్రైమ్స్ అన్నట్టు చూపిస్తున్నారు. ఒకప్పుడు బెంగుళూరు అంటే బ్యూటిఫుల్ గా చూపించేవాళ్ళు. ఇదంతా వేరే వాళ్ళు ఇక్కడకు వస్తున్న వలసల వల్లే జరుగుతుంది అని రాసుకొచ్చారు.

ఈ ట్వీట్ చర్చగా మారింది. డైరెక్టర్ మైగ్రేషన్ అనే పదం వాడటంతో బెంగుళూరు వేరే దేశంలో లేదు. ఇండియాలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు అంటూ కౌంటర్ ఇస్తున్నారు. అలాగే సినిమాని సినిమాలా చూడకుండా ఒక దర్శకుడు అయి ఉండి ఇలా కామెంట్ చేయడం ఏంటి అని ఫైర్ అవుతున్నారు కొంతమంది. మొత్తానికి లోక సినిమా కర్ణాటకలో వివాదంగా మారింది.

Also Read : SSMB 29 : రాజమౌళి మహేష్ సినిమా షూట్.. కెన్యా ఫారిన్ మినిస్టర్ పోస్ట్ వైరల్.. 120 దేశాల్లో మూవీ రిలీజ్ అంటూ..

అయితే బెంగుళూరు అమ్మాయిల డైలాగ్ పై మాత్రం లోక సినిమా యూనిట్ స్పందించి.. మేము ఎవర్ని హర్ట్ చేయాలని పెట్టలేదు.ఎవరి మనోభావాలైన దెబ్బ తిని ఉంటే క్షమించమని చెప్పి ఆ డైలాగ్ తీసేస్తున్నాము అని తెలిపారు.

Exit mobile version