Leo 2 : ‘లియో2’ ఎప్పుడు వస్తుందో చెప్పిన లోకేశ్ కనగరాజ్..
‘లియో’ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఫేక్ అని వార్తలు వచ్చిన దగ్గర నుంచి.. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా..? ఆ సీక్వెల్ లోనే లియో ఒరిజినల్ ఫ్లాష్‌బ్యాక్ ని చూపించబోతున్నారా..? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. తాజాగా వీటికి..

Lokesh KanagaRaj gave interesting update on Vijay Leo 2
Leo 2 : లోకేష్ కనగరాజ్ తన LCUలో భాగంగా తమిళ హీరో విజయ్ తో ‘లియో’ సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకొని ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ సినిమా రిలీజ్ తరువాత చాలా వార్తలు వినిపించాయి. ఈ మూవీలో లియోకి సంబంధించిన ఫ్లాష్‌బ్యాక్ ఫేక్ అని అసలు కథ వేరు ఉండొచ్చని లియో మేకర్సే కామెంట్స్ చేశారు.
దీంతో ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందా..? ఆ సీక్వెల్ లోనే లియో ఒరిజినల్ ఫ్లాష్‌బ్యాక్ ని చూపించబోతున్నారా..? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇక ఈ సీక్వెల్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందని అందరిలో నెలకున్న మొదటి ప్రశ్న. దానికి ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ జవాబు ఇచ్చారు. రీసెంట్ గా లోకేశ్ ని లియో 2 ఉంటుందా అని ప్రశ్నించగా.. ఆయన ఉంటుందని బదులిచ్చారు. దీంతో అది మొదలవుతుందని లోకేశ్ ని ప్రశ్నించారు.
దానికి లోకేశ్ బదులిస్తూ.. “ప్రస్తుతం నేను ‘తలైవా 171’ చేస్తున్నాను. ఆ తరువాత ‘ఖైదీ 2’ తెరకెక్కించాల్సి ఉంది. ఈ రెండు పూర్తి అయిన తరువాత లియో 2 ని మొదలుపెడతాను” అంటూ పేర్కొన్నారు. కాగా ఖైదీ 2లో LCUలో ఉన్న పాత్రలు అన్ని కనిపించబోతున్నాయని లోకేశ్ గతంలో తెలియజేశారు. ఖైదీ 2 ఒక పాత్రకి సంబంధించిన సినిమా కాదని, దానిలో విక్రమ్, రోలెక్స్, అమర్, లియో.. ఇలా అన్ని పాత్రలు ఉండనున్నాయని వెల్లడించారు.
Also read : Chiranjeevi : రచయితగా మారిన బ్రహ్మానందం.. బ్రహ్మి ఆత్మకథని లాంచ్ చేసిన మెగాస్టార్..
After #Kaithi2,I Will Start Process of #LEO2 & Im always Happy with Working with @actorvijay anna – @Dir_Lokesh ? pic.twitter.com/3T9ElwmaFV
— Siddarth ツ ?? (@TheCulpritVJ) December 27, 2023
కాగా లోకేశ్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న రజినీకాంత్ ‘తలైవా 171’ సినిమా LCUలో భాగంగా తెరకెక్కుతుందా లేదా అనేది తెలియదు. ఒకవేళ ఆ మూవీ కూడా LCUలో భాగంగా తెరకెక్కితే.. రజినీకాంత్ కూడా ఖైదీ 2లో కనిపించే అవకాశం ఉంటుంది. ఇక లోకేశ్ లియో 2 ని కన్ఫార్మ్ చేయడంతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం విజయ్ ‘దళపతి 68’లో నటిస్తున్నారు.