Maruva Tarama : ‘మరువ తరమా’ నుంచి ‘పరవశమే పరవశమే..’ మెలోడీ సాంగ్ విన్నారా?

ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేయగా తాజాగా మరో క్యూట్ మెలోడీ పాటను విడుదల చేశారు.

Maruva Tarama : ‘మరువ తరమా’ నుంచి ‘పరవశమే పరవశమే..’ మెలోడీ సాంగ్ విన్నారా?

Love Melody Paravasame Lyrical Song Released by Maruva Tarama Movie

Maruva Tarama Song : ఇటీవల మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. త్వరలో ‘మరువ తరమా’ అనే ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమా రాబోతోంది. అద్వైత్ ధనుంజయ హీరోగా, అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా కీవుత్త దర్శకుడు చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read : Tillu Square : డీజే టిల్లు సీక్వెల్ రన్ టైం జస్ట్ అంతేనా? సూపర్ హిట్ సినిమా సీక్వెల్‌కు ఎందుకు అలా?

ప్రస్తుతం ఈ మరువ తరమా సినిమా షూట్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేయగా తాజాగా మరో క్యూట్ మెలోడీ పాటను విడుదల చేశారు. పరవశమే పరవశమే.. అంటూ ఈ పాట వినడానికి చాలా బాగుంది. చైతన్య వర్మ ఈ పాటని రాయగా విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వంలో గౌతమ్ భరద్వాజ్ పాడారు. మీరు కూడా ఈ మెలోడీ పాటను వినేయండి.