Mahesh – Rajamouli : మహేష్ – రాజమౌళి సినిమాకు ఐడియా ఇచ్చింది ఇతనే.. రాజమౌళి వేరేవి అనుకుంటే వద్దని..

తాజాగా మహేష్ - రాజమౌళి సినిమా గురించి డైరెక్టర్ అవనీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Love Mouli Director Avaneendra Interesting Comments on Mahesh and Rajamouli SSMB 29 Movie

Mahesh – Rajamouli : మహేష్ బాబు – రాజమౌళి సినిమా కోసం అభిమానులతో పాటు దేశమంతా ఎదురుచూస్తుంది. ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినా ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు. కనీసం అధికారికంగా సినిమాని మొదలుపెట్టామని కూడా చెప్పట్లేదు. కానీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, వేరే దేశాల్లో షూటింగ్ అని, అడ్వెంచర్ కథతో ఈ సినిమా ఉంటుంది అని, మ్యూజిక్ మొదలుపెట్టేశారని పలువురు ఈ సినిమా టీమ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

తాజాగా మహేష్ – రాజమౌళి సినిమా గురించి డైరెక్టర్ అవనీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. నవదీప్(Navdeep) హీరోగా లవ్ మౌళి(Love Mouli) అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాతో అవనీంద్ర(Avaneendra) దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అయితే అవనీంద్ర చాలా సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు. విజయేంద్రప్రసాద్, రాజమౌళి టీమ్ లో అసోసియేట్ రైటర్ గా కూడా పనిచేసాడు. బాహుబలి కంటే ముందు నుంచి కూడా వీళ్ళతో కలిసి పనిచేసాడు అవనీంద్ర. RRR సినిమాకు కూడా అవనీంద్ర రచయితగా పనిచేసాడు.

Also Read : Rana Daggubati : ఆ హీరో కోసం అఘోరా క్యారెక్టర్ చేసిన రానా.. అదరగొట్టేసాడంట..

తాజాగా లవ్ మౌళి సినిమా ప్రమోషన్స్ లో ఇలా తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పిన అవనీంద్ర మహేష్ -రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ.. RRR సినిమా సమయంలోనే రాజమౌళి గారు నెక్స్ట్ మహేష్ బాబుతో చేస్తున్నారని మాకు తెలుసు. ఒక రోజు టీమ్ అంతా కూర్చొని మాట్లాడుకుంటుంటే మహేష్ తో ఎలాంటి సినిమా చేయాలని రాజమౌళి అడిగారు. అందరూ తలో ఒకటి చెప్పారు. చివరగా కౌబాయ్ లేదా జేమ్స్ బాండ్ తరహా సినిమా అయితే బెస్ట్ అనుకొని అక్కడ ఉన్న వాళ్లలో ఎంతమంది కౌబాయ్, ఎంతమంది జేమ్స్ బాండ్ సినిమా అయితే బెటర్ అని అడిగారు. నేను ఏ సమాధానం చెప్పకపోయేసరికి రాజమౌళి గారు నన్ను అడిగారు. అప్పుడు నేను ఆల్రెడీ కౌబాయ్ గెటప్ లో మహేష్ బాబుని చూసేసారు. జేమ్స్ బాండ్ హాలీవుడ్ సినిమాలు చూసి చూసి ఉన్నారు జనాలు, కొత్తగా ఉండకపోవచ్చు అని చెప్పాను. మరి ఎలాంటి కథ అయితే బెటర్ అని అడిగితే అడ్వెంచరస్ టైప్ కథ అయితే బెటర్, మన దగ్గర ఫుల్ లెంగ్త్ అడ్వెంచరస్ భారీ సినిమాలు రాలేదు, కొత్తగా ఉంటుంది అని చెప్పాను. దానికి రాజమౌళి గారికి కూడా నచ్చి ఓకే చేసారని తెలిపాడు.

అలాగే మహేష్ – రాజమౌళి సినిమాకు కూడా అవనీంద్ర రైటింగ్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నట్టు తెలిపాడు. బాహుబలి, RRR లతో ప్రపంచ ప్రేక్షకులను ఇండియా సినిమా వైపు తిప్పిన రాజమౌళి మరి మహేష్ సినిమాని ఏ రేంజ్ లో చూపిస్తాడో చూడాలి.