Love Story : మలయాళంలో ‘ప్రేమతీరం’

నాగ చైతన్య - సాయి పల్లవిల బ్యూటిఫుల్ ‘లవ్ స్టోరీ’ మలయాళంలో ‘ప్రేమ తీరం’పేరుతో రిలీజ్ కానుంది..

Love Story : మలయాళంలో ‘ప్రేమతీరం’

Prematheeram

Updated On : October 20, 2021 / 1:43 PM IST

Love Story: నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల కాంబినేషన్‌లో వచ్చిన బ్యూటిఫుల్ లవ్, ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘లవ్ స్టోరీ’ బక్సాఫీస్ బరిలో మ్యాజికల్ బ్లాక్‌బస్టర్‌గా సత్తా చాటింది. పాండమిక్ తర్వాత ప్రేక్షకుల భారీగా తరలి వచ్చారు. సినిమా హిట్ తెచ్చుకోవడంతో కలెక్షన్లు కూడా భారీగానే వచ్చాయి.

AHA : ‘ఆహా’లో ‘లవ్ స్టోరీ’.. డిటిటల్ ట్రైలర్ చూశారా

ఈ సినిమా అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటలకు ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ‘ఆహా’ ఓటీటీ తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా రీసెంట్‌గా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ డిజిటల్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. నాగ చైతన్య.. జుంబా కోచ్ రేవంత్ పాత్రలో.. సాయి పల్లవి మౌనిక క్యారెక్టర్‌లో నటించి మెప్పించారు..

Naga Chaitanya : క్రేజీ కాంబినేషన్..

తెలుగులో డిజిటల్ ప్రీమియర్స్ స్టార్ట్ అయిన వారం రోజుల తర్వాత ‘లవ్ స్టోరీ’ మూవీని మలయాళంలో థియేటర్లలో రిలీజ్ చెయ్యబోతున్నారు మేకర్స్. మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవికి అక్కడ మంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ బ్యూటిఫుల్ ‘లవ్ స్టోరీ’ ని మలయాళీ ప్రేక్షకుల ముందకు తీసుకెళ్తున్నారు. ‘ప్రేమ తీరం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అక్టోబర్ 29 నుంచి కేరళలో సందడి చెయ్యబోతుంది చై, సాయి పల్లవిల ‘ప్రేమ తీరం’..

Nandamuri Balakrishna : బ్రహ్మణి గిఫ్ట్ ఇచ్చిన బెంట్లీ కార్‌లో బాలయ్య రాయల్ ఎంట్రీ..