E20 Petrol : E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతుందా..? 2021 నీతి ఆయోగ్ నివేదిక ఏం చెప్పింది..
దేశంలో E20 పెట్రోల్ వాడకం పెరగాలంటే.. ఇటువంటి ఇంధనాల రిటైల్ ధర సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉండాలని నీతి అయోగ్ తన నివేదికలో ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

E20 Petrol
Fuel Efficiency: వాహనాల్లో 20శాతం ఇథనాల్ – మిశ్రమ పెట్రోల్ (E20)వాడకాన్ని ప్రోత్సహించే దిశగా భారత ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కానీ, ఆటోమొబైల్ పరిశ్రమతో సంబంధం ఉన్న కొంతమంది నిపుణులు ఈ రకమైన ఇంధనం వాహనాల ఇంధన సామర్థ్యాన్ని, అంటే మైలేజీని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. అయితే, తాజాగా.. 2021 నీతి ఆయోగ్య నివేదిక E20 ఇథనాల్ – మిశ్రమ పెట్రోల్ మైలేజీని ప్రభావితం చేస్తుందని పేర్కొంది.
E20 పెట్రోల్ వాహన మైలేజీలో 2 నుంచి 6శాతం తగ్గుదలకు దారితీయడంతో వినియోగదారులు రెట్టింపు నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. అధిక ఇంధన ధరలు చెల్లించినప్పటికీ తమ వాహన మైలేజీ తగ్గిందని పేర్కొంటున్నారు. ఇది ఆర్థికంగా భారంగా మారుతుందని ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అయితే, మేలేజీలో వచ్చే నష్టాన్ని భర్తీ చేయడానికి బ్లెండెడ్ ఇంధనాల రిటైల్ ధరలను తగ్గించాలని నీతి అయోగ్ నివేదిక సూచించింది.
భారతదేశంలో ఇథనాల్ బ్లెండింగ్ కోసం రోడ్‌మ్యాప్ 2020-25లో భాగంగా నీతి ఆయోగ్ -2021 నివేదిక విడుదలైంది. తాజాగా.. విడుదల చేసిన నివేదికలో పలు విషయాలు పేర్కొంది. దేశంలో E20 వాడకం పెరగాలంటే.. ఇటువంటి ఇంధనాల రిటైల్ ధర సాధారణ పెట్రోల్ కంటే తక్కువగా ఉండాలని సిఫార్సు చేసింది. ఇథనాల్ క్యాలరీ విలువ తగ్గింపును భర్తీ చేయడానికి, బ్లెండెడ్ ఇంధనానికి మారడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంధనంగా ఇథనాల్ పై పన్ను మినహాయింపులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని నివేదిక సూచించింది.
E20 ఇంధనాన్ని ఉపయోగిస్తున్నప్పుడు.. నాలుగు చక్రాల వాహనాలకు ఇంధన సామర్థ్యం దాదాపు 6శాతం నుంచి 7శాతం, 100% పెట్రోల్ (E0) కోసం మొదట రూపొందించబడిన మరియు E10 ఇంధనం కోసం క్రమాంకనం చేయబడిన ద్విచక్ర వాహనాలకు E20 (20% ఇథనాల్) ఇంధనాన్ని ఉపయోగించినప్పుడు ఇంధన సామర్థ్యంలో 3 నుంచి 4శాతం. అదేవిధంగా.. E10 కోసం రూపొందించబడిన, E20 కోసం క్రమాంకనం చేయబడిన నాలుగు చక్రాల వాహనాలకు 1 నుంచి రెండు శాతం మైలేజ్ తగ్గుతుందని నివేదిక హైలైట్ చేసింది. అయితే, ఇంజిన్లలో మార్పులతో, మిశ్రమ ఇంధనం వల్ల సామర్థ్యంలో నష్టాన్ని తగ్గించవచ్చునని నివేదిక పేర్కొంది.
2016 నుంచి 2021 సంవత్సరాల్లో జరిగిన రెండు అధ్యయనాలను పేర్కొంటూ.. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పరీక్షలో E20 వాహనాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపలేదని తేలిందని నివేదిక తెలిపింది.
ఇదిలాఉంటే.. 20శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌ను వాడాలనే భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.