Rukmini Vasanth : ఒక్క సినిమాతో స్టార్ డమ్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన.. చేతి నిండా సినిమాలు..
ఒక్క సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో రుక్మిణి వసంత్ కూడా చేరింది.(Rukmini Vasanth)

Rukmini Vasanth
Rukmini Vasanth : సినీ పరిశ్రమలో స్టార్ అవ్వడానికి ఒక్క సినిమా చాలు. హీరోయిన్ కి అయితే సినిమా రిజల్ట్ తో కూడా సంబంధం లేదు. ఒక్క సినిమాలో క్యూట్ గా కనిపించి మంచి నటన కనబరిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇక సినిమా హిట్ అయితే అది మరింత ప్లస్. అలా ఒక్క సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో రుక్మిణి వసంత్ కూడా చేరింది.(Rukmini Vasanth)
రుక్మిణి వసంత్
కన్నడ భామ రుక్మిణి వసంత్ కన్నడలో సప్త సాగరాలు దాటి అనే సినిమా చేసింది. ఆ సినిమాలో సింపుల్ గా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తునే ఒక మంచి భార్యగా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమా తెలుగులో కూడా రిలీజయి హిట్ అయింది. దీనికి ముందు రెండు సినిమాలు చేసినా రుక్మిణికి అంత గుర్తింపు రాలేదు. సప్త సాగరాలు దాటి సినిమా తర్వాత ఒక్కసారిగా స్టార్ అయింది రుక్మిణి.
ఇక ఆ సినిమా సీక్వెల్ లో మిడిల్ క్లాస్ భార్య పాత్రలో మొదటి భర్తని పోగొట్టుకొని రెండో పెళ్లి చేసుకున్న మహిళ పాత్రలో సింపుల్ లుక్స్ తో మంచి నటనతో అదరగొట్టేసింది. ఈ సినిమాతో తన నటనకు, లుక్స్ కి అంతా ఫిదా అయిపోయారు. ఇంకేముంది సప్త సాగరాలు దాటి రెండు సినిమాలతో ఒక్కసారిగా పాపులర్ అయి వరుస అవకాశాలు తెచ్చుకుంది రుక్మిణి వసంత్.
ఆ రెండు సినిమాల తర్వాత కన్నడలో బానదారియల్లి, భగీర, భైరతి రణగల్ సినిమాలతో మెప్పించింది. తమిళ్ లో ఏస్ సినిమాతో, తెలుగులో అపుడో ఇపుడో ఎపుడో సినిమాతో అలరించింది. ఇప్పుడు రుక్మిణి వసంత్ శివకార్తికేయన్ మదరాసి సినిమాలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 5న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్లో రుక్మిణి వసంత్ నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి నిర్మాత మాట్లాడటంతో ఒక్కసారిగా రుక్మిణి వైరల్ అయింది.
Also Read : Pawan Kalyan Birth Day : రేపే పవర్ స్టార్ బర్త్ డే.. అప్డేట్స్ ఏంటి మరి..? మూడు సినిమాల నుంచి..?
రుక్మిణి వసంత్ మదరాసి తర్వాత ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా, యష్ టాక్సిక్ సినిమా, రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 సినిమాలు చేస్తుంది. ఇవి కాకుండా మరో సినిమా కూడా చేతిలో ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ భారీ పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం. ఒక్క సప్త సాగరాలు దాటి సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకొని ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో స్టార్ హీరోలతో నటిస్తూ దూసుకెళ్తుంది రుక్మిణి. చేతిలో ఉన్న సినిమాలు రిలీజయితే మరిన్ని అవకాశాలు పరిగెత్తుకుంటూ రావడం ఖాయం. త్వరలోనే స్టార్ హీరోయిన్ హోదా అందుకొని భారీ రెమ్యునరేషన్ తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో క్యూట్ గా సింపుల్ లుక్స్ తో ఫొటోలు షేర్ చేస్తూ ఫాలోయింగ్ ని భారీగా పెంచుకుంటుంది.