Maa
MAA Association : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండా సొంత భవన నిర్మాణం. మా అసోసియేషన్ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయినా సొంత భవనం లేదు. దీనిని ఇప్పుడు ప్రధాన అంశంగా లేవనెత్తుతున్నారు. పోటీలో నిలిచిన ప్రకాష్ రాజ్ ఈ అంశాన్ని తెరమీదకు తీసుకరావడంతో హాట్ హాట్ చర్చలు కొనసాగుతున్నాయి. దీనిపై నటుల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి.
Read More : Afghanistan Crisis : కాబూల్ నుంచి 85 మందితో భారత్ బయలుదేరిన వాయుసేన విమానం
తాజాగా..దీనిపై నటులు మంచు విష్ణు కామెంట్స్ చేశారు. ‘మా’ భవనం అనేది అందరి కలగా వెల్లడించారు. త్వరలోనే ఆ కల నెరవేరబోతోందని, స్వయంగా తాను మూడు స్థలాలను చూడడం జరిగిందన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. maa family వారందరికీ గుడ్ మార్నింగ్ అంటూ స్టార్ట్ చేశారు. కారు నడుపుతూ..ఆయన మాట్లాడారు. తాను చూసిన స్థలాల్లో ఏది బెస్ట్ అనే దానిపై కూర్చొని మాట్లాడుకుని డిసైడ్ చేద్దామన్నారు. ఈ గుడ్ న్యూస్ మీతో చెప్పాలని అనే ఈ వీడియో పోస్టు చేయడం జరిగిందన్నారు.
Read More : Allu Arjun : ‘ఆహా’ కొత్త ఆఫీస్ ప్రారంభం..
(MAA): తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ”ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్.. ఈసారి అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగగా.. మంచు విష్ణు మరో ప్యానెల్ తరపున పోటీలో దిగుతున్నట్లుగా ప్రకటించారు. ప్రకాశ్‌రాజ్‌కి పోటీగా మంచు విష్ణు బరిలోకి దిగనుండటం.. ‘మా’ ఎన్నికలపై ఆసక్తి రెట్టింపయ్యింది. మంచు విష్ణూ పోటీలోకి దిగడంతో ‘మా’ ఎన్నికలు ఇప్పుడు మెగా vs మంచుగా మారిపోయాయి. అందుకు కారణం మెగా కుటుంబమే.
Read More : Taliban wife:కన్నకూతుళ్లనే అమ్మేసి జల్సాలు చేసిన కసాయి తాలిబాన్ ఉగ్రవాది నా భర్త
మా ఎన్నికల్లో ఎప్పుడూ కీలకంగా వ్యవహరించే మెగా బ్రదర్ నాగబాబు ఈసారి ప్రకాష్ రాజ్ ప్యానెల్‍కు సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం. ప్రకాష్ రాజ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్న నాగబాబు.. 2019 ఎలక్షన్స్‌లో నరేష్ ప్యానెల్‌కు సపోర్ట్ చేశారు. శివాజీ రాజా ప్యానెల్, నరేష్ ప్యానెల్ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చివరకు నరేష్ గెలిచారు.
Read More : BSNL Best Offer : BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఇదిగో.. రోజుంతా హైస్పీడ్ డేటా..!
మరోవైపు…సెప్టెంబర్ 12న అధ్యక్ష ఎన్నికలు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆగస్టు 22న ‘మా’ జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని, అనంతరం ఎన్నికల షెడ్యూల్ విడుదల చెయ్యలని నిర్ణయం తీసుకున్నారు. జనరల్ బాడీ మీటింగ్ తర్వాతే, ఎన్నికలపై ప్రకటన ఉండవచ్చు. ఈ సమావేశంలో ఏకగ్రీవంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మురళీమోహన్ కూడా ఏకగ్రీవం అయ్యేలా చూస్తామంటూ ప్రకటించారు. అంతకుముందు ‘మా’ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ కృష్ణంరాజుకు కూడా సభ్యులు లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
Good morning to my MAA family ??❤️ pic.twitter.com/6j8LddFuRG
— Vishnu Manchu (@iVishnuManchu) August 21, 2021