Taliban wife:కన్నకూతుళ్లనే అమ్మేసి జల్సాలు చేసిన కసాయి తాలిబాన్ ఉగ్రవాది నా భర్త

14 ఏళ్లకే తాలిబన్ ఉగ్రవాదికి భార్యగా మారి..కన్న కూతుళ్లనే తన కళ్లముందే అమ్మేస్తే గుండెలవిసేలా రోదించింది. మిగిలిన బిడ్డల్ని కాపాడుకోవటానికి భారత్ కు..

Taliban wife:కన్నకూతుళ్లనే అమ్మేసి జల్సాలు చేసిన కసాయి తాలిబాన్ ఉగ్రవాది నా భర్త

Taliban Wife Shocking Facts Revealed

Taliban wife shocking facts revealed : తాలిబన్లు. కర్కశత్వానికి మారుపేరు. వారికి దయాదాక్షిణ్యాలు ఉండవు.కట్టుకున్న భార్య అయినా కన్నకూతుళ్లు అయినా సరే వారి స్వార్థం కోసం తెగనమ్మేసే కసాయిలు. దయాదాక్షిణ్యాలు ఉండవు.జాలి కరుణ అనే మాటలకుఅర్థమే తెలియని నరరూప రాక్షసులు. వారికి తెలిసిందల్లా ఇస్లామిక్ రాజ్యాలను నెలకొల్పటం అంతే. దాంట్లో యుక్తాయుక్త విక్షణ అనే మాటలకు అర్థంమే తెలియని మతోన్మాదులు.మేం మారిపోయామంటూ వాళ్లు చెప్పే మాటలు శుద్ద అబద్దాలు. ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో వారి ఆలోచన అత్యంత దారుణం. ఆడవాళ్లను అస్సలు మనుషులుగానే చూడరు. వారు భార్యలైనా కన్నకూతుళ్లైనా అంతే. వారి దృష్టిలో ఆడవారి వారి విలాసాల కోసం స్వార్థం కోసం వాడుకునే ఓ వస్తువులు మాత్రమే. కంటికి నచ్చిన ఆడది తమ వశం కావాలి అంతే.

అటువంటి కరడు కట్టిన తాలిబన్ ఉగ్రవాది కన్న కూతుళ్లనే తెగనమ్మేశాడు. బిడ్డల కోసం తల్లడిల్లే భార్య ఆవేదనను కడుపుకోతను ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇద్దరు కూతుళ్లను సంతలో కూరగాయల్లా అమ్మేశాడు. అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్ల అరాచకపు అకృత్యాల కొనసాగుతున్న క్రమంలో ఓ తాలిబన్ భార్య ఆవేదనతో చెబుతున్న మాటలు వింటే తాలిబన్లు ఎంత కర్కశులో అర్థం చేసుకోవచ్చు. పట్టుమని 15 ఏళ్లు కూడా నిండని ఓ 14 ఏళ్లకే తాలిబన్ ఉగ్రవాదికి భార్య అయిన బాలిక అనుభవించిన నరకం ఊహించటానికి కూడా ధైర్యం చాలదు. పుట్టిన ఇద్దరు కూతుళ్లను తన కళ్లముందే తెగనమ్మేస్తే..నా బిడ్డల్ని నానుంచి విడదీయొద్దని ఆమె పెట్టిన కేకలు అరణ్య రోదనలుగా మిగిలిపోగా ఇద్దరు కూతుళ్లను సంతలో పశువుల్ని అమ్మేసిన అలనాటి దారుణం అనుభవాలను చెబుతోంది భారత్ లో జీవిస్తున్న తాలిబన్ భార్య ఫరీదా.

ఓ తాలీబాన్‌ ఉగ్రవాదిని పెళ్లి చేసుకున్న నేను ప్రతి క్షణం నరకం అనుభవించాను. నా కళ్ల ముందే నా ఇద్దరు కూతుళ్లను నా భర్త అమ్మేశాడు. వద్దని వేడుకుంటున్నా వినిపించుకోలేదు. తమ స్వలాభం కోసం ఎంతటి దారుణానికైనా తాలిబాన్లు తెగిస్తారు’.. ఇవి భారత రాజధాని న్యూఢిల్లీలోని భోగల్ నగరంలో నివసిస్తున్న ఫరీభా అనే ఓ మహిళ మాటలు. అఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఆమె అతి చిన్న వయసులోనే ఓ తాలిబాన్‌కు భార్యగా మారాల్సి వచ్చింది. ఆ తర్వాత తన పిల్లల ప్రాణాలను రక్షించుకునేందుకు ధైర్యం చేసి తెగించి దేశం దాటింది. భారత్‌కు వచ్చి పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ బతుకీడుస్తోంది. భోగల్ నగరంలో జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్న ఫరీబా తాను అనుభవించిన నరకాన్ని కళ్లకు కట్టినట్టు చెబుతోంది.

ఆమె పేరు ఫరీదా. పుట్టింది అఫ్ఘనిస్తాన్ దేశంలోనే. పేదరికం కన్నకూతుర్ని కసాయివాడికి ఇచ్చి పెళ్లి చేసేలా చేసింది. ఫలితంగా ఫరీదాకు 14 ఏళ్ల వయసుకే తనకంటే 20 ఏళ్లు పెద్దవాడైన ఓ తాలిబాన్‌ ఉగ్రవాదకి ఇచ్చి పెళ్లి చేసేసారు తల్లిదండ్రులు. కానీ పాపం ఫరీదాకు అప్పడు తెలియదు తాను ఓ కరడు కట్టిన ఉగ్రవాదకి భార్య అవుతున్నానని. స్కూలుకెళ్లాల్సిన వయస్సులో గుండెల్లో గుబులుతోనే అత్తారింట్లో అడుగుపెట్టింది. అంతే అత్తింటి గడప దాటమే..ఇక బయటి ప్రపంచం ఎలా ఉంటుందో కూడా మర్చిపోయింది. కానీ ఇంట్లో ఓ సెక్స్ అందించే యంత్రంలా తయారైంది. చిన్నవయస్సే అయినా..భర్త హక్కు కాబట్టి ఆమె అనారోగ్యంతో ఉందో..అతనికి అవసరం లేదు.లైంగిక వాంఛ తీర్చాలి అంతే. ఫలితంగా గర్భవతి అయ్యింది.ఓ ఆడపిల్ల పుట్టింది. అలా ఆమె ప్రమేయం లేకుండానే నలుగురు ఆడ పిల్లలకు నేను తల్లి అయ్యింది ఫరీదా. బయటకు అడుగు పెట్టనిచ్చేవారు కాదు. అడుగడుగునా ఆంక్షలు. ప్రశ్నిస్తే ఒళ్లు వాచిపోయేలా దెబ్బలు, చిత్రహింసలు. ఒళ్లంతా పచ్చి పుండులా ఉన్న భర్త కోరిక తీర్చాల్సిందే. అంతటి నరరూప రాక్షసుడు ఫరీదా భర్త.లైంగిక బానిసగా..పిల్లల్ని కనే యంత్రంలా మారిపోయింది ఫరీదా. ఎన్ని చిత్రహింసలు పెట్టినా పిల్లల కోసం అంతా భరించింది. నోరు విప్పకూడదు.

అన్నింటినీ భరించిన ఫరీదా తన బిడ్డల్ని తెగనమ్ముతుంటే మాత్రం సహించలేకపోయింది. భరించలేకపోయింది. మొదటిసారిగా నోరువిప్పింది. ప్రశ్నించింది. బిడ్డల్ని తెగనమ్ముతుంటే ఫరీదా పడిన వేదన వర్ణనాతీతం. అలనాటి ఆ దారుణం ఘటనల గురించి ఫరీదా కన్నీటితో చెబుతూ… ‘నా బిడ్డల్ని నానుంచి దూరం చేయకు..వారి జీవితాలను నాశనం చేయొద్దు అంటూ కాళ్లావేళ్లా పడి బతిమాలినా నా గోడు వినలేదు. నా పెద్ద కూతురిని నా భర్త నా కళ్ల ముందే అమ్మేశాడు. ఆ డబ్బులతో జల్సాలు చేశాడు. ఆ తరువాత రెండో కూతురిని కూడా అమ్మేందుకు అన్ని రెడీ చేసుకున్నాడు. దీంతో నా రెండో కూతురు ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పి తీసుకెళ్లిపోయిన నా భర్త.. అటునుంచి అటే అమ్మేసి ఉంటాడు. మళ్లీ నా కూతురిని నాకు చూపించలేదు.

ఇప్పుడు నా కూతురు బతికి ఉందో, ఎవరికైనా అమ్మేశాడో కూడా చెప్పలేదు. నేను పడిన మానసిక క్షోభను నా తల్లిదండ్రులకు చెప్పాను. వాళ్లు మిగిలిన ఇద్దరు కూతుళ్ల కోసమైనా ఆలోచించమని చెప్పారు. ఈ దేశం నుంచి వెళ్లి వేరే ఎక్కడయినా వెళ్లిపోయి బతకమని చెప్పారు. అలా నా తల్లితో కలిసి నా ఇద్దరు కూతుళ్లను తీసుకుని నేను భారత్‌కు వచ్చేశాను. నేను గతంలో కూడా భారత్‌కు ఓసారి రావటంతో భారత్ గురించి కాస్త అవగాహన ఉంది. ఇక్కడ స్త్రీలకు చక్కటి స్వేచ్ఛ ఉంది. కష్టపడి బతకటానికి చక్కటి అవకాశాలున్నాయి.

కానీ నా దేశంలో ఆడవాళ్లను కనీసం మనుషుల్లా కూడా చూడరు. అందుకే నాలుగేళ్ల క్రితం భారత్‌కు వలస వచ్చాను. నేను భారత్‌కు వచ్చేశాక.. నా తండ్రిని నా బంధువుల్ను నేను ఎక్కడున్నానో చెప్పమని నా భర్త బెదిరించేవాడు. చెప్పకపోతే చంపేస్తామని హెచ్చరించారట. అయినా వాళ్లు మాగురించి చెప్పలేదు. ఎన్నిసార్లు బెదిరించినా హెచ్చరించినా చెప్పలేదు. ఇప్పటికి నాకు ఎన్నో వందల ఫోన్లు వస్తుంటాయి. నీలాగా మేం కూడా భారత్‌కు వచ్చేస్తామని..దయచేసి తమకు సహాయం చేయమని ఎంతోమంది ఆడవారు కోరుతున్నారు. ఇప్పటికే నాలాగా ఎంతో మంది అఫ్ఘాన్ ప్రజలు పొట్ట చేత్తో పట్టుకుని ప్రాణాలను రక్షించుకునేందుకు భారత్‌కు వచ్చారు. వాళ్లను భారత ప్రభుత్వం శరణార్థులుగా గుర్తించాలని కోరుతున్నాను’ అని ఫరీభా కోరుతోంది. తన పిల్లలను ఇక్కడే పెంచి పెద్ద చేస్తాననీ, బాగా చదివిస్తానని ఇక ఎప్పటికీ అఫ్గాన్ వెళ్లనని చెబుతోంది ఫరీదా. కాగా ఆఫ్గాన్ నుంచి బిడ్డల కోసం భారత్ శరణార్థిగా వచ్చిన ఫరీదా కుటుంబం కోసం..పిల్లల కోసం ఎంతో కష్టపడింది. ప్రస్తుతం ఢిల్లీలో జిమ్ ట్రైన‌ర్‌గాపనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది.