Allu Arjun : ‘ఆహా’ కొత్త ఆఫీస్ ప్రారంభం..

ఐకాన్ స్టార్ అ్లలు అర్జున్ చేతుల మీదుగా ‘ఆహా’ కొత్త ఆఫీస్ ప్రారంభం..

Allu Arjun : ‘ఆహా’ కొత్త ఆఫీస్ ప్రారంభం..

Aha New Office

Allu Arjun: తెలుగు ప్రేక్షకులు 100% తెలుగు కంటెంట్, అంతులేని ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తూ.. అతి తక్కువ టైంలోనే పాపులర్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌గా గుర్తింపు తెచ్చుకుంది ‘ఆహా’..

Aha : ‘ఆహా’ లో.. ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’..
ఇప్పుడు ‘ఆహా’ కోసం కొత్త కార్యాలయం నిర్మించారు. ఐకాన్ స్టార్ అ్లలు అర్జున్, ‘ఆహా’ ప్రమోటర్ రామారావు జూపల్లి కలిసి శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా పూజా కార్యక్రమాలతో కొత్త ఆఫీసుని ప్రారంభించారు.

 

Aha

‘ఆహా’ త‌మ ప్రేక్షకుల కోసం తెలుగులో ఎన్నో గొప్ప చిత్రాల‌ను అందించింది. మ‌మ్ముట్టి నటించిన ‘వ‌న్‌’, న‌య‌న‌తార ‘నీడ‌’, రిష‌బ్ శెట్టి ‘హీరో’, టోవినో థామ‌స్ యాక్ష‌న్ మూవీ ‘కాలా’, విజ‌య్ సేతుప‌తి ‘విక్ర‌మార్కుడు’, మంజు వారియ‌ర్‌, స‌న్నీ వేనె నటించిన టెక్నో హారర్ థ్రిల్లర్.. ‘చతుర్ ముఖం’.. వంటి చిత్రాలు స‌హా ప‌లు ఒరిజిన‌ల్స్‌ను తెలుగు ప్రేక్ష‌కులకు ‘ఆహా’ అందించింది.

Tharagathi Gadhi Daati : ‘ఆహా’ లో ఫీల్ గుడ్ వెబ్ సిరీస్.. ‘త‌ర‌గ‌తి గ‌ది దాటి’..

రీసెంట్‌గా అమ‌లా పాల్‌, రాహుల్ విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా విడుద‌లైన సై ఫై థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ‘కుడి ఎడ‌మైతే’ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. లక్ష్మీ మంచు హోస్ట్‌గా సెల‌బ్రిటీలు చేస్తున్న వంట‌ల షో ‘ఆహా భోజ‌నంబు’ ల‌తో పాటు ఈ ఏడాది ‘క్రాక్‌’, ‘నాంది’, ‘లెవ‌న్త్ అవ‌ర్‌’, ‘జాంబి రెడ్డి’, ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ వంటి సినిమాలు, ఒరిజ‌న‌ల్స్‌తో ప్రేక్ష‌కుల‌కు తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది ‘ఆహా’.

Aha Bhojanambu : ‘ఫ్యూజన్‌‌‌లో కన్ఫ్యూజన్’.. మంచు లక్ష్మీతో ముచ్చట్లు..