BSNL Best Offer : BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఇదిగో.. రోజంతా హైస్పీడ్ డేటా..!

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రోజూ 2GB వరకు హైస్పీడ్ డేటాను ఎంజాయ్ చేయొచ్చు.

BSNL Best Offer : BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఇదిగో.. రోజంతా హైస్పీడ్ డేటా..!

Bsnl Rs 1,498 Prepaid Plan Launched

BSNL Prepaid Plans : ప్రముఖ దేశీయ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం కొత్త యానివల్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు రోజూ 2GB వరకు హైస్పీడ్ డేటాను ఎంజాయ్ చేయొచ్చు. అలాగే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. 365 రోజుల వరకు వ్యాలిడిటీతో ఆఫర్ చేస్తోంది. ఆగస్టు 23 నుంచి దేశంలోని అన్ని BSNL సర్కిళ్లలో ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ అందుబాటులోకి రానుంది.

ప్రస్తుత కస్టమర్లతో పాటు కొత్త కస్టమర్ల అందరికి ఈ  ప్లాన్ వర్తిస్తుంది. ఇంతకీ ఈ యానివల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర రూ.1,498గా నిర్ణయించింది. రోజులో హైస్పీడ్ డేటా 2GB దాటితే స్పీడ్ 40Kbpsకు పడిపోతుంది. కరోనా పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోం లేదా ఆన్ లైన్ క్లాసులుకు హాజరవుతున్నవారికి ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుందని చెప్పవచ్చు. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ స్టోర్ల నుంచి కూడా పొందవచ్చు.

మరో దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ కూడా రూ. 1,498తో ఏడాది ప్రీయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. 365 రోజుల వ్యాలిడిటీతో మొత్తంగా 24GB డేటాను ఆఫర్ చేస్తోంది. అలాగే అన్ లిమిటెడ్ కాల్స్, 3,600 SMSలు అందిస్తోంది. ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే అదనంగా Airtel XStream Premium, Free Hellotunes, Wynk Music, online classes వంటి మరిన్నో బెనిఫిట్స్ అందిస్తోంది.

అలాగే.. మరో టెలికం దిగ్గజం వోడాఫోన్ ఐడియా (Vi) కంపెనీ కూడా రూ. 1,499 ఏడాది ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా ప్రీపెయిడ్ కస్టమర్లు 365 రోజుల్లో మొత్తంగా 24GB హైస్పీడ్ డేటాను పొందవచ్చు. అలాగే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 3,600 SMSలను కూడా పొందవచ్చు. అంతేకాదు.. Zomato ఫుడ్ ఆర్డర్లపై టర్మ్స్ అండ్ కండీషన్లతో ప్రతిరోజూ రూ.75 వరకు క్యాష్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.

డేటా సంచలన దిగ్గజం రిలయన్స్ జియో కూడా యానివల్ ప్లాన్ ఒకటి తీసుకొచ్చింది. రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ ద్వారా రోజూ 2GB హైస్పీడ్ డేటాను అందిస్తోంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100SMSలను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ కూడా 365రోజులు ఉంటుంది. కాంప్లిమెంటరీ జియో యాప్స్ కూడా యాక్సస్ చేసుకోవచ్చు.