Maa Ramudu Andarivadu : ‘మా రాముడు అందరివాడు’ రివ్యూ..
Maa Ramudu Andarivadu: 'మా రాముడు అందరివాడు' రివ్యూ..
Maa Ramudu Andarivadu
Maa Ramudu Andarivadu : అనుముల ప్రొడక్షన్స్, శ్రీరామ్ క్రియేషన్స్ బ్యానర్లపై అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు నిర్మాణంలో యద్దనపూడి మైకిల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మా రాముడు అందరివాడు’. శ్రీరామ్, స్వాతి మందాడి జంటగా నటించగా సుమన్, సమ్మెట గాంధీ, నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, ఆనంద భారతి, గడ్డం నవీన్, చిట్టిబాబు.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. నేడు సెప్టెంబర్ 4న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది.
కథ విషయానికొస్తే.. రౌడీయిజం చేస్తూ ఎమ్మెల్యేగా ఎదుగుతాడు వరదరాజులు (అనుముల లక్ష్మణరావు). ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. అదే ఊళ్ళో ఊరి కోసం, ప్రజల కోసం రైతు సత్యం (పల్లాకొండ శ్రీరామ్)పోరాడుతూ ఉంటాడు. సత్యం కొడుకు రాముడు(పల్లాకొండ శ్రీరామ్)కి తండ్రి అంటే చాలా ఇష్టం. కానీ ఊళ్ళో పరిస్థితులు, అన్యాయాలు చూసి కోపంతో నక్సలైట్ అవుతాడు. కొన్ని సంఘటనలతో వరదరాజులు కొడుకు సత్యంను చంపేస్తాడు. తండ్రి మరణంతో రాముడు ఊరికి తిరిగొస్తాడు. మరి రాముడు పగ తీర్చుకుంటాడా? తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తాడా? ఆ ఎమ్మెల్యే, అతని అనుచరుల నుంచి జనాల్ని కాపాడతాడా.. తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Shantabai Song : ‘శాంతాబాయి’ మళ్ళీ వచ్చేసింది.. ఈసారి సన్నీలియోన్ వర్షన్..
సినిమా విశ్లేషణ : ఓ ఊళ్ళో విలన్, అతని ఆగడాలను ఎదిరించే మంచి వ్యక్తి అతను చనిపోతే కొడుకు ఆ స్థానం తీసుకోవడం అనే పాయింట్ తో చాలానే సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కథ కూడా అలాంటిదే. ఫస్ట్ హాఫ్ అంతా సింపుల్ గా ఊళ్ళో గొడవలు, తండ్రి కొడుకుల అనుబంధం, హీరో నక్సలైట్ అవ్వడంతో సాగిపోతుంది. తండ్రి మరణించాక రాముడు ఎంట్రీ దగ్గరనుంచి అసలు కథ మొదలవుతుంది. పల్లెటూరి వాతావరణం, కుటుంబ అనుబంధాలు, రాజకీయ పోరాటం చూపిస్తూ ఈ సినిమాని తెరకెక్కించారు. అక్కడక్కడా ఒకటి రెండు సీన్లు నవ్వించారు. మధ్యలో లవ్ ట్రాక్ రాసుకున్నారు కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. డివోషనల్ టచ్ ఇస్తూ కొన్ని AI విజువల్స్ చూపించారు. ఇది లేకపోయినా సినిమా కథ చూపించొచ్చు. రొటీన్ పగ, విలనిజం, యాక్షన్ సీన్స్ తో పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు.
నటీనటుల పర్ఫార్మెన్స్.. తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో పల్లాకొండ శ్రీరామ్ బాగానే నటించారు. అనుముల లక్ష్మణరావు విలన్ గ అనెగిటివ్స్ షేడ్స్ లో మెప్పించారు. సుమన్ ముఖ్యమంత్రి పాత్రలో గెస్ట్ అప్పిరెస్సాన్ ఇస్తారు. నాగ మహేష్, బాహుబలి ప్రభాకర్, జబర్దస్త్ అప్పారావు, గడ్డం నవీన్, స్వాతి మందాడి, ప్రియ.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Allu Aravind vs yash mother : అల్లు అరవింద్ వర్సెస్ యశ్ మదర్ వివాదం.. అసలు విషయం ఇదేనా?
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. పాటలు యావరేజ్. చాలా ల్యాగ్ సీన్స్ ఎడిటింగ్ లో కొంత కట్ చేయాల్సింది. పాత కథ, కథనంతోనే దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు. నిర్మాణ పరంగా మాత్రం సినిమాకు కావాల్సినంత బాగానే ఖర్చుపెట్టారు.
మా రాముడు అందరివాడు ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ పొలిటికల్ రివెంజ్ యాక్షన్ సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
