Mad Square three days Collections
నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ మ్యాడ్ స్క్వేర్. 2023లో వచ్చిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుని థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ విడుదలైన మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 55.2 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ద్వారా తెలియజేసింది.
అనుదీప్, రెబా మోనికా జాన్, సునీల్, సత్యం రాజేష్,ప్రియాంక జవాల్కర్, అనుదీప్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. . భీమ్స్ సిసిరోలియో పాటలు, థమన్ నేపథ్య సంగీతం అందించారు.
Theatres are shaking 😉
Crowds are roaring 🫶🏻
And the MAD gang is ruling 😎#MadSquare grosses 55.2 Crs+ in 3 Days and the repeat audience fever is spreading like wildfire ❤️🔥#BlockBusterMaxxMadSquare 🥳@NarneNithiin #SangeethShobhan #RamNitin @ItsJawalkar @MusicThaman… pic.twitter.com/pic3DmWOmD— Sithara Entertainments (@SitharaEnts) March 31, 2025