Mahadevuni Charanteja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పన్నెండవ కంటెస్టెంట్.. అగ్నిపరీక్ష చరణ్..
మహాదేవుని చరణ్ తేజ పన్నెండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. (Mahadevuni Charanteja)
Mahadevuni Charanteja
Mahadevuni Charanteja : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా మొదలయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్, రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్, మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ, నాలుగవ కంటెస్టెంట్ గా యాంకర్ సుధీర్ రెడ్డి, అయిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష ద్వారా అమన్ మసూద్ ఎంట్రీ ఇచ్చాడు. ఆరవ కంటెస్టెంట్ గా సీరియల్ నటి చైత్ర రాయ్, ఏడవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఆటో రామ్ ప్రసాద్, ఎనిమిదవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష షాలిని పటేల్ ఎంట్రీ ఇచ్చింది.
తొమ్మిదవ కంటెస్టెంట్ గా విలన్ టెంపర్ వంశీ ఎంట్రీ ఇవ్వగా పదవ కంటెస్టెంట్ గా సృష్టి ఎంట్రీ ఇచ్చింది. పదకొండవ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ నరేష్ ఎంట్రీ ఇచ్చాడు. పన్నెండవ కంటెస్ట్ గా అగ్నిపరీక్ష లో ఫైనల్ కి వచ్చిన వాళ్లలో సెలెక్ట్ చేసారు. మహాదేవుని చరణ్ తేజ పన్నెండవ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. చరణ్ ఆర్జేగా వర్క్ చేస్తూ అగ్నిపరీక్షకు అప్లై చేసి అందులో సెలెక్ట్ అయి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
Also Read : Jabardasth Naresh : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన పదకొండవ కంటెస్టెంట్.. జబర్దస్త్ నరేష్..
