Mahakali : హనుమాన్ సినిమాటిక్ యూనివర్స్.. ‘మహాకాళి’ గ్లింప్స్ వచ్చేసింది.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా రిలీజ్ చేసిన మహాకాళి గ్లింప్స్ మీరు కూడా చూసేయండి.. (Mahakali)
Mahakali
Mahakali : ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వచ్చిన హనుమాన్ సినిమా తర్వాత ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేసిన సినిమాలపై అంచనాలు నెలకొన్నాయి. కానీ ఆ సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలీదు అన్నట్టు ఇన్నాళ్లు సాగింది. ఆ యూనివర్స్ లో భాగంగానే మహాకాళి అనే సినిమాని కూడా ప్రకటించారు. తాజాగా మహాకాళి సినిమా గ్లింప్స్ ని రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.
RKD స్టూడియోస్ బ్యానర్ పై RK దుగ్గల్ నిర్మాణంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వ పర్యవేక్షణలో పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో ఈ మహాకాళి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో భూమి శెట్టి, ఆకాశాయ్ ఖన్నా, శ్రీయ రెడ్డి, రాకేష్ బేడీ, సముద్రఖని, మురళి శర్మ.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహాకాళి సినిమాని 2027 జనవరి 8న సంక్రాంతి ముందు వారం రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
Also Read : Irumudi Collections : అదరగొట్టిన రవితేజ ‘ఇరుముడి’ కలెక్షన్స్.. ఇప్పటికే ఎన్ని కోట్లు ప్రాఫిట్స్ తెలుసా?
తాజాగా రిలీజ్ చేసిన మహాకాళి గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..
ఈ సినిమాలో అక్షయ్ ఖన్నా శుక్రాచార్యుడిగా నటించగా, శ్రియారెడ్డి అమ్మవారి పాత్రలో నటిస్తుంది. దైవం సపోర్ట్ ఉండే అమ్మాయి ఫిమేల్ లీడ్ పాత్రలో భూమి శెట్టి నటిస్తుండగా సముద్రఖని హనుమాన్ సినిమాలోని విభీషణుడి పాత్రను కంటిన్యూ చేస్తారని తెలుస్తుంది.
