రూ.100 కోట్ల క్లబ్‌లో మహర్షి
కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యి, ట్రేడ్ వర్గాల వారిని సైతం ఆశ్చర్య పరిచింది మహర్షి..

కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యి, ట్రేడ్ వర్గాల వారిని సైతం ఆశ్చర్య పరిచింది మహర్షి..
సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా మహర్షి, బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మహేష్ 25వ సినిమాపై నెలకొన్న అంచనాలు, పైగా సమ్మర్ హాలిడేస్ కావడంతో ఎక్కువ థియేటర్లలో సినిమాని రిలీజ్ చేసారు. ఫస్ట్ డే ఆంధ్ర, తెలంగాణాలో రూ. 24.6 కోట్ల షేర్ రాబట్టింది మహర్షి. రెండవ రోజు కాస్త డల్ అయినా, వీకెండ్‌లో బాగా పుంజుకుంది. కేవలం రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయ్యి, ట్రేడ్ వర్గాల వారిని సైతం ఆశ్చర్య పరిచింది.
ఓవర్సీస్‌లోనూ 1 మిలియన్ మార్క్ దాటేసింది. ఓవర్సీస్‌లో 1 మిలియన్ సాధించిన మహేష్ సినిమాల్లో మహర్షి 9వ సినిమా కావడం విశేషం. ఇప్పటికి 1.5 మిలియన్స్ క్రాస్ చేసి, 2 మిలియన్ క్లబ్‌కి చేరువలో ఉంది. వ్యవసాయం చేసే రైతు గొప్పతనాన్ని, పంట పండించే వాడి అవసరాన్ని చక్కటి సందేశం ద్వారా చెప్పడంతో మహర్షికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.
పిల్లలు మరియు యువత వేసవి సెలవులు కావడంతో ‘వీకెండ్ వ్యవసాయం’ పేరుతో తమవంతు సేద్యం చెయ్యడానికి పొలాల బాట పడుతున్నారు. ప్రస్తుతానికి పోటీగా ఇతర సినిమాలేవీ లేకపోవడం, సెలవులు కావడం, పైగా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా కావడంతో బాక్సాఫీస్ దగ్గర మహర్షి స్పీడ్ మరికొద్ది రోజుల పాటు కొనసాగనుంది.