‘ఏం సాధిద్దాం అనుకుంటున్నావ్ రిషి’? అని రావు రమేష్ మహేష్‌ని అడగడం, ‘ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నాను సార్’ అని మహేష్ చెప్పడంతో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్.. మహేష్‌లోని డిఫరెంట్ యాంగిల్స్ అన్నిటినీ చూపించింది..
సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే జంటగా, వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో, వైజయంతీ మూవీస్.. అశ్వినీదత్, శ్రీ వెకటేశ్వర క్రియేషన్స్.. దిల్ రాజు, పివిపి సినిమా.. పెరల్ వి.పొట్లూరి – పరమ్ వి.పొట్లూరి కలిసి నిర్మించిన మహేష్ 25వ సినిమా, మహర్షి.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని, పీపుల్స్ ప్లాజాలో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా మహర్షి థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.
Also Read : చిల్లర రాజకీయాలు : లక్ష్మీస్ NTR మూవీపై ఫస్ట్ టైం స్పందించిన చంద్రబాబు
‘ఏం సాధిద్దాం అనుకుంటున్నావ్ రిషి’? అని రావు రమేష్ మహేష్‌ని అడగడం, ‘ప్రపంచాన్ని ఏలేద్దామనుకుంటున్నాను సార్’ అని మహేష్ చెప్పడంతో స్టార్ట్ అయిన ఈ ట్రైలర్.. మహేష్‌లోని డిఫరెంట్ యాంగిల్స్ అన్నిటినీ చూపించింది. కాలేజ్ స్టూడెంట్, కార్పొరేట్ సీఈవో, ఫార్మర్.. ఇలా డిఫరెంట్ రోల్స్‌లో మహేష్ కనిపిస్తున్నాడు. లుక్ వైజ్ మరింత యంగ్‌గా ఉన్నాడు.. చాలా రోజుల తర్వాత అల్లరి నరేష్‌కి మంచి రోల్ దొరికిందనిపిస్తుంది.
పూజా కూడా కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించింది. జగపతి బాబు విలన్‌గా, ప్రకాష్ రాజ్, జయసుధ మహేష్ పేరెంట్స్‌గా నటించారు. ఝాన్సీ, సమీర్, వెన్నెల కిషోర్ తదితరులు నటించిన మహేష్ 25వ సినిమా మహర్షి.. అతని కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మే 9న మహర్షి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
వాచ్ మహర్షి ట్రైలర్..