చిల్లర రాజకీయాలు : లక్ష్మీస్ NTR మూవీపై ఫస్ట్ టైం స్పందించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయంటూ వైసీపీ నేతలు ఫిర్యాదులు చేయడం చూస్తుంటే.. వాళ్లే అల్లర్లు చేస్తారేమో అని అనుమానం కలుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

  • Published By: vamsi ,Published On : May 2, 2019 / 01:15 AM IST
చిల్లర రాజకీయాలు : లక్ష్మీస్ NTR మూవీపై ఫస్ట్ టైం స్పందించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయంటూ వైసీపీ నేతలు ఫిర్యాదులు చేయడం చూస్తుంటే.. వాళ్లే అల్లర్లు చేస్తారేమో అని అనుమానం కలుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు జరుగుతాయంటూ వైసీపీ నేతలు ఫిర్యాదులు చేయడం చూస్తుంటే.. వాళ్లే అల్లర్లు చేస్తారేమో అని అనుమానం కలుగుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గతంలో ఓట్ల తొలగింపులపై కుట్రలు చేసి వాళ్లే ఓట్లు తొలిగించినట్లుగా.. ఇప్పుడు కూడా అదే కుట్రలకు పాల్పడవచ్చునేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు జరిగిన వివేకానంద రెడ్డి హత్యకేసుని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి, ఇప్పటికి కూడా నిందితులు ఎవరో తేలకుండా చేశారని ఆరోపించారు.
Also Read : యతి ఉందా? : భారత ఆర్మీ ఫోటోలపై శాస్త్రవేత్తలు ఏమన్నారు

అలాగే ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు రోడ్డు మీద ప్రెస్‌మీట్ పెట్టుకుంటా అంటే సిస్టమ్ చూస్తూ ఊరుకోదని, వారిని అరెస్ట్ చేస్తే ఆ విషయంలో తనని జగన్ విమర్శిస్తున్నారని రామ్ గోపాల్ వర్మ అరెస్ట్‌పై జగన్ వ్యాఖ్యలను చంద్రబాబు తిప్పికొట్టారు.

అలాగే, లక్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా గురించి మాట్లాడిన చంద్రబాబు.. ఆ సినిమాను తెలంగాణలో విడుదల చేశారు కదా? లక్ష్మీపార్వతి ఎక్కడ ఉందో అందరికి తెలిసిన విషయమే కదా? ఎందుకు ఇటువంటి కుట్రరాజకీయాలు చేస్తారు అంటూ ప్రశ్నించారు.
Also Read : కేసీఆర్ అంటే భయం లేదు: మే 23 తర్వాత అసలు సినిమా చూపిస్తాం